మోడీ పై కేసీఆర్ లేఖాస్త్రం కవితను రక్షించుకునేందుకేనా?

Publish Date:Mar 6, 2023

Advertisement

‘దుర్వినియోగం కాని అధికారం అధికారమే కాదు’ (Power is no power, if it is not misused) ఇదొక ఇంగ్లీష్ నానుడి. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ అధికారంలో ఉన్న పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడతాయి. అది అభిలషణీయం కాకపోయినా అదే నిజం. అదే వాస్తవం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారత చరిత్ర చెపుతున్న సత్యం ఇది. 

అధికారంలో ఎవరుంటే వారు రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం, విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా 2014లో మొదలైన అపచారం కాదు. బీజేపీ పుట్టక ముందే ఈ దురాచారం మొదలైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంది. ఇప్పడు బీజేపీ  కూడా  అదే పని చేస్తోంది.  కాంగ్రెస్ హయాంలో వంద సార్లకు పైగా ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన) దుర్వినియోగం అయింది.  1959లోనే కేరళలోఇఎమ్‌ఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వానికి అసెంబ్లీ మెజారిటీ ఉన్నప్పటికీ, కేంద్రం బర్తరఫ్ చేసింది. రాష్ట్రపతి పాలనా విధించింది. ఇక అప్పటి నుంచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో వంద సార్లకు పైగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలలో ఆర్టికల్ 356 దుర్వినియోగం అయింది. అలాగే, కాంగ్రెస్ హయాంలో  సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార దుర్వినియోగం గురించి విపక్షాలు విమర్శలు చేయడం కాదు, సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు  సిబిఐని  ‘పంజరంలో చిలక’ (Parrot in the cage) అని పేర్కొన్నది.

అలాగని, ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తప్పని కాదు  చేయకూడదనీ కాదు. అయితే ఈ ఆరోపణలను ప్రజలు ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటారు అనేదే, ప్రశ్న. 
అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ నేపధ్యంతో  ప్రజా తీర్పును  గౌరవించాలంటూ ప్రధాని మోడీకి తొమ్మిది విపక్ష పార్టీల నేతలు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ లేఖపై నలుగురు సీఎంలు కేసీఆర్, మమతా బెనర్జీ, భగవంత్ మాన్, కేజ్రీవాల్ తో పాటు  బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్,  నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, యేపీ  మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంతకాలు చేశారు.  గ

వర్నర్ వ్యవస్థను  రాజకీయం  చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.  ఇది మంచి పద్దతి కాదని సూచించారు. నిజమే కానీ, ఈ లేఖ రాసిన  సమయం సందర్భం, అందులోని అంశాలను గమినిస్తే,  ప్రజలు విపక్షాల ఆరోపణలను, (ముఖ్యంగా తెలంగాణ ప్రజలు) ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు అనేది అనుమానమే అంటున్నారు.  ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్  తన కుమార్తె రక్షించుకునేందుకే లేఖాస్త్రాని సంధించారని అంటున్నారు.

 నిజానికి సిసోడియా అరెస్ట్ నేపధ్యంగా కేసీఆర్, ఇతర నేతలు లేఖ రాసినా  కవితను కాపాడుకోవడమే కేసేఆర్ ప్రధాన లక్ష్యమని సామాన్య ప్రజలకు కూడా అర్థమైందని అంటున్నారు. అయితే ఎవరేమన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలాగే ఈ లేఖలో సంతకాలు చేసిన నేతలు పేర్కొన్నట్లుగా, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు.. ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారు.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.