తెలుగుదేశం కూటమికే జనం జై: అయితే, ఆ సమస్యలు అధిగమించాలి.. చాణక్య స్ట్రాటజీస్ సర్వే.!

Publish Date:Oct 1, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన తాజా రాజకీయ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ప్రజాభిప్రాయం, స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలన, కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన బీజేపీ మధ్య సమన్వయం, వైసీపీ బలం వంటి పలు అంశాలను పరిశీలించినట్లు చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వేలోని అంశాలు ఏపీ రాజకీయాల్లో  ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాల్లో 164 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తియిన సందర్భంగా.. కూటమి పాలనపై ప్రజాల అభిప్రాయం, జనం మూడ్ ఎలా ఉందన్న అంశాన్ని తాజా సర్వే పరిశీలించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, జాబ్ క్యాలెండర్, పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలు అమలవుతున్నప్పటికీ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్షేత్రస్థాయి నాయకత్వం, కార్యకర్తలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయం చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో  తేలింది. 

ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచడం, నెల నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ వంటి అంశాలు ప్రజలకు చేరుతున్నాయని సర్వే పేర్కొంది. అయితే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా జరిగిన పెన్షన్ పంపిణీ సమయంలో కనిపించిన ప్రచార స్థాయి ఇప్పుడు కనిపించడం లేదన్న అభిప్రాయం జనంలో  వ్యక్తమౌతోంది. ఇక తల్లికి వందనం పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ కూటమి నేతలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సర్వే ఫలితంలో వెల్లడైంది.

 

అన్నిటికీ మించి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలోనూ, ప్రభుత్వంపై వైసీపీయులు చేసే విమర్శలను తిప్పి కొట్టడంలోనూ తెలుగుదేశం వినా, కటమిలోని మిగిలిన రెండు భాగస్వామ్య పార్టీల నేతలూ పెద్దగా ముందుకు రావడం లేదన్న అభిప్రాయం కూడా ఈ సర్వేలో తేటతెల్లమైంది.   జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఆయన పాలనపై ప్రజల్లో విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని సర్వే స్పష్టం చేసింది.  చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలరన్న విశ్వాసం ప్రజల్లో  ప్రస్ఫుటంగా వ్యక్తమౌతోంది. అయితే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రం క్షేత్రస్థాయిలో జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని  చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తేలింది.  ఇసుక, మట్టి, ఇతర స్థానిక వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లపై వస్తున్న ఫిర్యాదులు, చిన్న చిన్న ప్రజా సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి  క్షేత్రస్థాయిలో ప్రజలలో కనిపిస్తోందని సర్వే పేర్కొంది.  

ఏపీలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. ఆ పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు వాస్తవంగా ఎప్పుడు ప్రారంభమవుతాయన్న చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోందని సర్వే పేర్కొంది. కొన్ని పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగినప్పటికీ.. అనేక చోట్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది.

అమరావతి నిర్మాణ పనులకు ప్రతిరోజూ అప్‌డేట్లు వస్తున్నట్టే.. పరిశ్రమలు, పెట్టుబడి ప్రాజెక్టుల పురోగతిపై కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తే విశ్వాసం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం సర్వేలో  వ్యక్తమైంది. శంకుస్థాపనలు ఎప్పుడు పూర్తవుతాయి.. పరిశ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నలకు జనం సమాధానం కోరుకుంటున్నారని తేలింది.  

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెమ్మదించిన పలు సాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందన్న అంశాన్ని కూడా సర్వే ప్రస్తావించింది. వెలిగొండ, పోలవరం ఎడమ గట్టు కాలువ, కుప్పం ప్రాంతానికి తాగు, సాగునీరు, పులివెందులకు తాగునీరు అందించే ప్రాజెక్టులు వంటి వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని పేర్కొంది. అయితే ఈ పనుల గురించి ప్రజల్లోకి బలంగా వెళ్లే స్థాయిలో ప్రచారం జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం అధికార కూటమికి ఇబ్బందికరంగా మారుతోందని సర్వే విశ్లేషించింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని, వాటికి దీటుగా కౌంటర్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం, కూటమి భాగస్వామ్య పార్టీలో విఫలమౌతున్నాయని సర్వే తేల్చింది. 

ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పార్టీలలో కీలకమైన జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలపై జరుగుతున్న ప్రచారం కూడా జనంలో చర్చనీయాంశంగా మారిందని సర్వే పేర్కొంది. వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా వలసలు జరుగుతుండటం ఆ అభిప్రాయానికి కారణంగా సర్వే పేర్కొంది.  గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న కాలంలో.. స్థానికంగా టీడీపీ నాయకులతో రాజకీయంగా తలపడిన నేతలు జనసేనలో చేరుతుండటం, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నాయకులతో  ముందుముందు జనసేన సమన్వయం దెబ్బతినే అవకాశం ఉందన్న అభిప్రాయం, ఆందోళన అయా ప్రాంతాలలోని స్థానికులలో బలంగా వ్యక్తమౌతోందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది.  మరీ ముఖ్యంగా ఈ పరిస్థితి స్థానిక ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. 

ఇక తెలుగుదేశం   సీనియర్ నాయకులకు, మంత్రి నారా లోకేష్‌కు మధ్య సమన్వయం, ప్రాధాన్యత వంటి అంశాలపై కూడా సర్వేలో  పరిశీలించింది. పార్టీలో సీనియర్లకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత ప్రస్తుతం లేదన్న అభిప్రాయం కొంతమంది నాయకుల్లో ఉందని పేర్కొంది. కీలక పదవులు, నిర్ణయాల్లో సీనియర్ల అభిప్రాయాలను తగిన స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదన్న అసంతృప్తి కూడా ఉందని తెలిపింది.

అదే సమయంలో పవన్ కల్యాణ్, లోకేష్ మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు వంటి ప్రచారం క్షేత్రస్థాయిలో వినిపిస్తోందని సర్వే పేర్కొంది. అయితే బహిరంగంగా మాత్రం ఇరువురు నేతలు కూటమి కొనసాగుతుందని చెబుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఈ తరహా ప్రచారానికి కూటమి అగ్రనాయకత్వం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. భవిష్యత్తులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కలిసి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూటమి ఐక్యతపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది.

ఇక వైసీపీ విషయానికి వస్తు.. వైసీపీ, కూటమి మధ్య అంతరం తగ్గుతోందన్న అభిప్రాయం ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాల్లో కనిపిస్తోందని సర్వే పేర్కొంది. కడప జిల్లాలో కమలాపురం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ వైపు ఓటర్ల మొగ్గు కనిపిస్తోందని తెలిపింది. కర్నూలు జిల్లాలోనూ కూటమి నాయకులు ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న అసంతృప్తి ప్రజలలో బలంగా వ్యక్తమైందని సర్వే పేర్కొంది.  

కూటమి వైఫల్యాలను వైసీపీ నిర్మాణాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందన్న విశ్లేషణను సర్వే చేసింది. అయితే ఇది సర్వే సంస్థ అభిప్రాయం మాత్రమేనని, వాస్తవ ఎన్నికల ఫలితాలను ముందుగానే నిర్ణయించే అంశంగా చూడలేమని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. 

అలాగే స్థానిక ఎన్నికల విషయానికి వస్తే.. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, సర్దుబాట్లే కీలకమని సర్వే పేర్కొంది.   జనసేన నాయకులు ఎక్కువ సంఖ్యలో స్థానాలను కోరుతున్నారని, రోవైపు ఇప్పటికే గ్రామస్థాయిలో తమకు బలమైన పట్టు ఉందని భావిస్తున్న టీడీపీ నాయకులు సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్న అభిప్రాయం కూడా ప్రజలలో ఉందని సర్వే పేర్కొంది.

టీడీపీ, జనసేన నాయకత్వం క్షేత్రస్థాయిలో విభేదాలను ముందుగానే పరిష్కరించకపోతే వాటి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని సర్వే విశ్లేషించింది. గతంలో పరస్పరం పోటీ చేసిన లేదా విమర్శలు చేసుకున్న నాయకులు ఇప్పుడు కలిసి ప్రచారం చేయాల్సిన పరిస్థితి రావడం కూడా కూటమికి కీలక సవాలుగా మారనుందని పేర్కొంది.

మొత్తంగా చూస్తే.. చాణక్య స్ట్రాటజీస్ తాజా సర్వేలో కూటమి ప్రభుత్వానికి కొన్ని అంశాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన ఉన్నప్పటికీ.. స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం, పెట్టుబడుల అమలు, జనసేనలో చేరికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకం వంటి అంశాలు కీలకంగా మారుతున్నట్లు పేర్కొంది. ఈ అంశాలను కూటమి నాయకత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందన్నది రాబోయే రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారనుంది.

[AP Political Survey, Chanakya Strategies Survey, AP Political Survey, Chandrababu, TDP, Janasena, BJP, YCP, AP Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.