సైకిల్ తోనే పొత్తు.. 14న జనసేనాని క్లారిటీ?

Publish Date:Mar 6, 2023

Advertisement

మార్చి  14.. జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఏపీలో పార్టీ పుట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగు పెడుతోంది జనసేన.. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ఈసందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న బందరులో భారీ బహిరంగసభ నిర్వహించాలని జనసేన  నిర్ణయించింది. 

2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది. అయితే జనసేన పోటీ చేసిన సీట్లలో కేవలం రాజోలులో మాత్రమే పార్టీ అభ్యర్ది రాపాక వరప్రసాద్ గెలిచారు.  ఆ తరువాత ఆయనా వైసీపీ గూటికి చేరారనుకోండి అది వేరే సంగతి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓడిపోయారు.  దీంతో ఈసారి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. సీరియస్ పాలిటిక్స్  పై దృష్టిని కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో జనసేన పదో పుట్టిన రోజుపై అందరిలో ఆసక్తిని కనిపిస్తోంది.   

జనసేన  బందరు బహిరంగ సభలో పవన కళ్యాణ్  పొత్తుల విషయంలో ఏమి మాట్లాడతారు? ఎలాంటి ప్రకటన చేస్తారు? అనే విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  నిజానికి గత సవత్సరం మంగళగిరిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలోనే పవన్ కళ్యాణ్  తొలి సారిగా, పొత్తుల విషయాన్నిప్రస్తావించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. ఇక అక్కడి నుంచి, పొత్తుల చర్చ మలుపుల మీద మలుపులు తిరిగి.. చివరకు బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే దిశగా అడుగులు పడుతున్నాయి. 

 అయితే ఇంతవరకూ ఇందుకు సంబంధించి తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పొత్తు విషయంలో స్పష్టమైన సంకేతాలు అయితే పవన్ కళ్యాణ్ ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే దాగుడు మూతలకు తెరదించుతూ బందరు సభలో పొత్తులపై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్  ఒక నిర్ణయానికి వచ్చారని జనసేన శ్రేణులే చెబుతున్నాయి. 

నిజానికి బందరు సభలో పవన్  ఇటు పొత్తుల విషయంలో, అటు కాపు రిజర్వేషన్ విషయంలో క్లారిటీ ఇస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అందుకే  పార్టీ ఆవిర్భావ సభకు ముందుగానే కీలక అంశాల పైన పార్టీ నేతలతో చర్చలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 11వ తేదీన పవన్ విజయవాడ చేరుకోనున్నారు. 12వ తేదీన మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తో సహా అన్ని జిల్లాల కాపు నేతలతో పవన్ సమావేశం కానున్నారు. వారి నుంచి కాపు రిజర్వేషన్ల అంశం పైన అభిప్రాయాలు సేకరించి.. పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలనే అంశం పైన ఒక నిర్ణయం తీసుకోనున్నారు. 

అలాగే  13వ తేదీ పార్టీ ముఖ్య నేతలతో పవన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే క్రమంలో అమలు చేసిన వ్యూహాలు.. నియోజవకర్గ సమీక్షలు.. వారాహి పై రాష్ట్ర వ్యాప్త పర్యటన గురించి ఈ భేటీలో నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు కొనసాగుతున్నా రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. పెరుగుతోంది. నిజానికి  బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని కూడా అంటున్నారు. ఇదే విషయాన్ని  పవన్ పార్టీ నేతలతో పంచుకొనే అవకాశం ఉందని అంటున్నారు.

టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. ఈ అంశం పైన పార్టీ నేతల నుంచి పవన్ అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉంది. బీజేపీ, టీడీపీ తో జనసేన భవిష్యత్ బంధం గురించి పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ పొత్తు నిర్ణయాధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. ఆవిర్భావ సభా వేదిక నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దం అవుతున్నారు.

ఆ సభా వేదిక నుంచే బీజేపీ, టీడీపీతో తమ భవిష్యత్ సంబంధాల పైన క్లారిటీ ఇస్తారని సమాచారం. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. వైసీపీ సవాళ్ల నడుమ ఇక పొత్తుల అంశం పైన ఎక్కవ కాలం సాగదీయటం మంచిది కాదని పవన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొత్తుల వ్యవహారంతో పాటుగా.. కాపు రిజర్వేషన్ల పైన జనసేన వైఖరి..కార్యాచరణ పవన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఈ సారి జనసేన ఆవిర్భావ సభపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.