Publish Date:May 12, 2022
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర కాంగ్రెస్ లో అంతకు ముందు లేని జోష్ కనిపిస్తోందని ఆ పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో అంగీకరించేంత మార్పు కనిపించింది. ఆదిలో సీనియర్ల అలకలు, మోహం చాటేయడాలు వంటివి ఉన్నా.. క్రమంగా అవి మరుగున పడి రాష్ట్రంలో తెరాసను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన జవసత్వాలను సంతరించుకుంది. మధ్య మధ్యలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఒంటెత్తు పోకడలపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసినా, మీడియాకెక్కి రచ్చ చేసినా పార్టీకి పెద్దగా నష్టం వాటిల్లింది లేదు. పైగా పార్టీ హైకమాండ్ రేవంత్ కు పూర్తి మద్దతుగా నిలబడటంతో.. అంతర్గత విభేదాలు, రేవంత్ వ్యతిరేక నేతలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన విజయవంతంతో పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలతో సన్నద్ధం అవుతున్నదని అంతా భావించారు.
అయితే పైకి గట్టిగా ఎవరూ మాట్లాడకపోయినా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ లో మాత్రం ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి లేదు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఒంటెత్తు పోకడలు కాంగ్రెస్ కు నష్టం చేకూర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ ను ప్రజలు గుర్తించారనీ, అయితే మెజారిటీ నియోజకవర్గాలలో రేవంత్ తీరు వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నయనీ వారు చెబుతున్నారు.
మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉండి, నియోజకవర్గ స్థాయిలో ప్రజలలో ఆదరణ సంపాదించుకున్న సీనియుర్లను కాదని వారికి పోటీగా వేరేవారిని ప్రోత్సహిస్తుండటం పట్ల పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ గా కొత్త వారికి అవకాశాలివ్వాలన్న ఆయన ఉద్దేశాన్ని తప్పు పట్టలేం కానీ, విధేయులనీ, పార్టీ కోసం పని చేసిన వారినీ పక్కన పెట్టడం వల్ల కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొని అధికారంలోకి రావాలన్న పార్టీ లక్ష్యాన్ని సాధించాలంటే మాత్రం రేవంత్ తన వైఖరి మార్చుకోవాలని వారంటున్నారు.
క్షేత్ర స్థాయిలో గట్టి పునాదులు ఉన్న పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ముందు నుంచీ పార్టీకి విధేయంగా ఉన్న వారిని అవకాశాలకు గండి కొట్టకుండా, కొత్త వారిని ప్రోత్సహించాలనీ, అలా కాకుండా విధేయులకు నియోజకవర్గంలో పోటీ నాయకత్వాన్ని పెంచి పోషించేలా వ్యవహరిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-ignore-congress-loyals-25-135789.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.