ప్రశాంత్ కిషోర్ రూట్‌లో కేసీఆర్ ప్రయాణం
Publish Date:Feb 3, 2022
Advertisement
దేశ రాజకీయాల్లో కారు స్టీరింగ్ తిప్పగలిగినంత ఈజీగా రాజకీయాలు చేయగల నేర్పు మా బాస్ కేసీఆర్ సొంతమని గులాబీ దళంలోని లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఢంకాబజాయించి మరీ చెబుతారు. మరి అంత ఈజీగా రాజకీయాలు చేసే.. సీఎం కేసీఆర్.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఎందుకు ఆశ్రయించారనే ప్రశ్న అయితే తెలంగాణ సమాజంలో ఉత్పన్నమవుతోంది. దీనిపై సమాధానం ఇచ్చేందుకు మాత్రం కారు పార్టీలోని ఏ ఒక్క లీడరే కాదు.. క్యాడర్ సిద్దంగా లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని గులాబీ బాస్ కేసీఆర్.. భావిస్తున్నారు. కానీ తెలంగాణ వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులు నేడు రాష్ట్రంలో లేవు.. అంతేకాదు.. అటు ప్రతిపక్షాలు.. ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎండకడుతూ ప్రజల్లోకి దూసుకు పోతుంటే.. ఇటు తెలంగాణ ప్రజలు సైతం చాలా తెలివిగా వ్యవహారిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్.. ఎన్నికల వ్యూహాకర్త.. ప్రశాంత్ కిషోర్‌లో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారని... ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు సీఎం కేసీఆర్ ఫాలా ఫాలో అంటూ ఆయన మాటలను ఫాలో అయిపోతున్నారని సమాచారం. అయితే ఫిబ్రవరి 1వ తేదీన మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఆ క్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. గంటన్నర సేపు బడ్జెట్‌పై ప్రసంగిస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం.. రెండున్నర గంటల ప్రెస్ మీట్ పెట్టి.. కేవలం మోదీ ప్రభుత్వాన్ని తిట్టారనే టాక్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంత్ కిషోర్ స్క్రీప్ట్‌లో భాగంగానే సీఎం కేసీఆర్.. ఇలా చేశారనే టాక్ అయితే తెలంగాణ సమాజంలో నడుస్తోంది. ఈ ప్రెస్ మీట్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఓ రేంజ్‌లో గులాబీ బాస్‌పై వ్యంగ బాణాలు సంధిస్తున్నారు. గతంలో చాలా సార్లు బడ్జెట్ ప్రసంగం నడిచినా... సీఎం కేసీఆర్.. ఏనాడు మోదీ ప్రభుత్వంపై ఇలా ఉతుకు కార్యక్రమం చేపట్టిందీ లేదని తెలంగాణ ప్రజలు గుర్తు చేస్తున్నారు. కానీ బీజేపీతో తనకు, తన పార్టీకి ముప్పు తప్పదనే ఒకే ఒక్క భయంతో సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్‌లో ఎటాక్ స్టార్ట్ చేశారని కమలదళం స్పష్టం చేస్తోంది. అంతేకాదు రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అందుకే రాజ్యాంగాన్ని సైతం మార్చేయాలంటూ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని.. గతంలో ఆయనే రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ముఖ్యమంత్రి అయ్యారని.. అలాంటిది రాజ్యాంగాన్ని మార్చేయమనడం సీఎం కేసీఆర్‌కు ఎంత వరకు సబబు అని తెలంగాణ సమాజం సూటిగా ప్రశ్నిస్తోందీ.
http://www.teluguone.com/news/content/kcr-follows-prashanth-kishor-39-131204.html





