జై తెలంగాణ అనేందుకు కేసీఆర్ కు భయమా?

Publish Date:Jan 19, 2023

Advertisement

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ రేపిన దుమారం కొంత సర్డుమణిగింది. ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు వచ్చిన దారిన వెనక్కి వెళ్ళారు. ఆ వచ్చిన నలుగురూ ఏ సందేశం తీసుకు వెళ్ళారో ఏమో కానీ, భారాస నాయకులు, కార్యకర్తలే కాదు తెలంగాణ మేథావులు,సామాన్య ప్రజానీకంలోనూ అంతర్మథనం మొదలైన సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

 మరో వంక ఖమ్మం సభ మంచి చెడులు, లాభ నష్టాలపై అన్ని పార్టీలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార భారాసలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడదు కదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయ విశ్లేషకులు విభిన కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. అయితే  ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా ఖమ్మం సభ ఇస్తుందనుకున్న క్లారిటీ అయితే ఇవ్వలేదని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. 

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి( తెరాస) పేరును  భారతీయ రాష్ట్ర సమితిగా (భారాస) గా మార్చడంతోనే తెలంగాణ అస్థిత్వ రాజకీయాలకు, రాజకీయ విలువలకు పార్టీ దూరమైందని.. ఇప్పడు ఖమ్మం సభలో ఎక్కడా జై తెలంగాణ నినాదమే వినిపించక పోవడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతోందని విశ్లేషకులు అంటున్నారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎక్కడ తెరాస సభ జరిగినా, జై తెలంగాణ నినాదమే ప్రధానంగా వినిపించేది. చివరకు ఆ నినాదంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసేది,  కానీ, ఇప్పడు జై భారత్  కేసీఆర్ తమ ప్రసంగం ముగించారు. కానీ, ఏ నినాదం నినదిస్తూ 1200 మంది ప్రాణత్యాగం చేశారో .. అమరులయ్యారో ఆ ‘జై తెలంగాణ’ అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. ఇది ప్రజలకు పార్టీకి మధ్య దురాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు.

 ఇదే విషయంగా రాజకీయ ప్రత్యర్దులే కాదు, మేథావులు, ఉద్యమ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏవరి దాకానో ఎందుకు, తెలంగాణ మలి దశ ఉద్యమంలో,కేసీఆర్ కు  కుడి భుజంగా నిలిచిన కోదండరాం, బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగా అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని  ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల పంపిణీ జాప్యానికి వ్యతిరేకంగా ఈనెల 30న ఢిల్లీలో జరప తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను కోదండరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. కృష్ణా నదీపైన ప్రాజెక్టులు అన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, కాళేశ్వరం కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు పూర్తి కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందని చెప్పడం అబద్దమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. పేదల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారన్నారు.

 ప్రైవేటుకు వ్యతిరేకమని చెబుతున్న కేసీఅర్ సింగరేణిలో సగం ప్రైవేటు పరం చేసింది నిజం కాదా? అని కోదండరాం ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు తప్పితే అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, విద్యా, వైద్యం, సింగరేణి ప్రైవేటు అయ్యాయనీ, ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయన్నారు. ఈ నెల 30న కృష్ణా నదీ జలాల్లో వాటాపై డిల్లీలో పోరాడుతామని, 31న విభజన హామీలపై సెమినార్ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. ఒక్క కోదండ రామ్ మాత్రమే కాదు, భారాస నాయకులు కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంద్రా పాలకులు అసెంబ్లీలో తెలంగాణ పేరును బ్యాన్ చేశారని ఆరోపించిన కేసేఆర్, ఇప్పడు స్వరాష్ట్రంలో తెలంగాణ పేరును నిషేదించారని ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.