ఖమ్మంలో మరో బహిరంగ సభ.. ఈ సారి బీజేపీ?

Publish Date:Jan 19, 2023

Advertisement

ఖమ్మంలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.  ఈసారి బీజేపీ.. ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు  తెలుస్తోంది. వచ్చే నెలలో ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ సభకు కమలం పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరవుతారని.. వారి సమక్షంలో ఖమ్మం జిల్లాకు చెందిన లోక్‌సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాషాయం కుండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు. 

మరో వైపు జనవరి 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సభ జరిగిన రోజే న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరిగింది,  కానీ పొంగులేటి కమలం గూటికి చేరడం మాత్రం జరగలేదు. ఖమ్మం వేదికగా కేసీఆర్ సభ జరిగిన అనంతరం..  బీజేపీలో చేరాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి  భావించారని.. అందుకే ఆయన బీజేపీలోకి ఎంట్రీ కొంచం వాయిదా పడిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి.. అనంతరం మునుగోడులో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో  కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా.. బీజేపీ మాత్రం అనూహ్యంగా ఓటు బ్యాంకును భారీగా పెంచుకొంది.  

అదే విధంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ సభావేదికపైనే పొంగులేటిని బీజేపీ గూటిలో చేర్చుకోవాలని కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఎందుకంటే.. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తెలంగాణలోని ఖమ్మం వేదికగా నిర్వహించిన శంఖారావం సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత...  సైకిల్ పార్టీకి కేడర్ తప్ప లీడర్ లేంటున్న ప్రత్యర్థి పార్టీల నాయకులకు..ఈ సభతో సరైన సమాధానం లభించినట్లు అయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభకు.. వివిధ రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు  హాజరయ్యారు.   దీంతో బీజేపీ అగ్రనాయకత్వం.. ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ స్పష్టమైన సందేశం ఇవ్వాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది.   

ఇప్పటికే తెలంగాణలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని  కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటి .. అధికారం చేపట్టాలని  బీజేపీ భావిస్తోంది. ఆ క్రమంలో తెలంగాణలో పార్టీ బలహినంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి..  ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగు వేస్తోంది. 

అందులోభాగంగా వివిధ పార్టీల్లో ఉన్న కీలక నేతలను తమ గుటిలోకి తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. అదీ కూడా గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో తమ పార్టీకి ఏ మాత్రం ఢోకా లేదనే ఓ స్పష్టమైన సంకేతాన్ని, సందేశాన్నీ.. ప్రత్యర్థి పార్టీలకే కాదు.. ప్రజలకు సైతం ఇవ్వాలన్న  అజెండాతో కమలదళం.. ఆ దిశగా అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.