సీఎం పోస్టు కోసం కేటీఆర్ లొల్లి! భరించలేకే కాశీకి కేసీఆర్ ఫ్యామిలీ 

Publish Date:Jan 29, 2021

Advertisement

కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది? గులాబీ లీడర్లు కేటీఆర్ కు ఎందుకు జై కొడుతున్నారు? కల్వకుంట్ల ఫ్యామిలీ కాశీకి ఎందుకు వెళ్లింది?  తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకుని కేటీఆర్ కు ఆ పదవి అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.  కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేటీఆర్ ను సీఎం చేయాలంటూ ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై స్పందించడం లేదు. అదే సమయంలో సీఎం మార్పుపై  ప్రకటనలు చేస్తున్న నేతలను వారించడం లేదు. తన ముందే సీఎం మార్పుపై పార్టీ నేతలు మాట్లాడుతున్నా... కేటీఆర్ ఖండించడం లేదు. ఇవే ఇప్పుడు అనేక సందేహాలకు కారణమవుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  

కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, ప్రగతి భవన్ లోని కీలక వర్గాల  విశ్వసనీయ సమాచారం ప్రకారం కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచనే కేసీఆర్ లేనే లేదని తెలుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి సీటుపై కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద యుద్ధమే జరుగుతుందని చెబుతున్నారు. తనను ముఖ్యమంత్రిగా నియమించాలని కేసీఆర్ పై కేటీఆర్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని.. ఈ విషయంలో కేటీఆర్ కు ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్సీ కవిత సహకరిస్తున్నారని సమాచారం. మొదట సీఎం సీటు కోసం కవిత పోటీ పడినా.. కేటీఆర్, సంతోష్ లు ఆమెను కూల్ చేశారని గతంలో కేసీఆర్ కు కుడి భుజంగా మెలిగిన, టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదె ఇన్నయ్య చెబుతున్నారు. తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇస్తానని కవితకు కేటీఆర్ హామీ ఇవ్వడం వల్లే ఆమె సైలెంట్ అయ్యారని ఆయన వెల్లడిస్తున్నారు. కేటీఆర్ హామీతో కవిత కూడా సీఎంగా తప్పుకోవాలని తండ్రిపై ప్రెషర్ పెడుతున్నారని ఇన్నయ్య చెబుతున్నారు. 

 కేటీఆర్, కేసీఆర్ గొడవలో మంత్రి హరీష్ రావు కూడా తలదూర్చారని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా నియమించడానికి ఇదే సమయమని కేసీఆర్ కు నచ్చచెప్పటానికి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం అందుకు ఇష్టపడటం లేదట. ఇందుకు బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది.  టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను క్యాన్సిల్ చేశారు కేసీఆర్. పీఆర్సీ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు,  ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే... పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందే. తాను విఫలమయ్యానే ఆరోపణలను కేసీఆర్ లాంటి ఉద్యమ నేతలు ఎప్పటికి జీర్ణించుకోలేరు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ కు సీఎం పగ్గాలు ఇవ్వడానికి కేసీఆర్ సిద్దంగా లేరని గాదె ఇన్నయ్య చెబుతున్నారు.  

కేసీఆర్ కలల ప్రాజెక్ట్ యాదాద్రి పునర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు.  యాదాద్రి ప్రారంభోత్సవాన్ని వైభవంగా జరపాలని, ఆ సందర్భంగా యాగం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా కేసీఆర్ సొంత గడ్డలో నిర్మిస్తున్న .. కాళేశ్వరంలో అతి పెద్ద రిజర్వాయర్  అయిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది. అది పూర్తయ్యాకా ముఖ్యమంత్రిగా తానే దాన్ని ప్రారంభించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. కేటీఆర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడానికి  నిఘా వర్గాల నివేదికలు కూడా  కారణమని తెలుస్తోంది.  కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని  నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది.  

ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. .ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు.  అందుకే సీఎం మార్పు గురించి ఆయన ఆలోచన కూడా చేయడం లేదంటున్నారు. దీంతో  కేసీఆర్ తన మాట వినే పరిస్థితి లేదని గ్రహించిన కేటీఆర్ మరో దారిలో నరుక్కొస్తున్నారని.. అందులో భాగంగానే టీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రకటనలు చేస్తున్నారని భావిస్తున్నారు. కేటీఆర్ సీఎం అవుతారంటూ ప్రకటనలు చేస్తున్న వారంతా ఆయనతో సన్నిహితంగా ఉంటున్నవారేనని గులాబీ లీడర్లే చెబుతున్నారు. పార్టీ నేతల ద్వారా కేసీఆర్ పై ఒత్తిడి తేవడం కోసం కేటీఆరే డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందంటున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇంట్లో జరుగుతున్న గొడవలు భరించలేకే కవిత.. తన ఫ్యామిలీతో కాశీకి వెళ్లారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగేలా ఆయన సతీమణి శోభా చొరవ తీసుకోవాలని ఒకప్పుడు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గాదె ఇన్నయ్య కోరుకుంటున్నారు. ఇందుకోసం కేసీఆర్ తో పాటు కుటుంబసభ్యులను శోభమ్మ ఒప్పించాలని ఇన్నయ్య విజ్ఞప్తి చేసుకుంటున్నారు.

మరోవైపు  కేటీఆర్ ఎంతగా ప్రయత్నించినా.. ఏ రకమైన ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ తలొగ్గే పరిస్థితులు ఉండవని.. ఆయనతో సన్నిహితంగా ఉండే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంత త్వరగా మార్చుకోరని.. పార్టీ విషయంలో అసలే తీసుకోరని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయో చూడాలి మరీ..

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.