కేసేఆర్ సర్కార్ కు ఢిల్లీ సెగ

Publish Date:Mar 14, 2023

Advertisement

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు  కేంద్ర ప్రభుత్వం పై రాజకీయ యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ (బీజేపీ)ని ఇరకాటంలో నెట్టేందుకు, కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

కానీ, కాలం కలిసి రాకపోతే, తాడే ... పామవుతుంది అన్నట్లు, కేసీఆర్ వ్యూహాలు ఎదురు తిరుగుతున్నాయని  బీఆర్ఎస్ నాయకులే ఆందోళన  వ్యక్త పరుస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి,  నువ్వు గోకినా గోకకపోయినా, నేను మాత్రం నిన్ను గోగుతూనే ఉంటా అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే, కథ రివర్స్ లో నడిస్తున్నట్లుంది.  ఇప్పటికే  ఒక వంక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కుంటున్నారు.

ఆ కేసు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో, ఏ మవుతుందో  తెలియని పరిస్థితి. మరో వంక ఫార్మ్ హౌస్ (ఎమ్మెల్యేల బేర సారాల) కేసులోనూ సుప్రీంలో చుక్కెదురైంది. సీబీఐ విచారణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీబీఐ విచారణ జరుపుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఫార్మ్ హౌస్  కేసులో  బీజేపీని బద్నాం చేసేందుకు చేసిన ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యింది. ఈ కేసులో ముఖ్యమంత్రి అతి  ఉత్సాహాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది.  చక్కగా చీవాట్లు పెట్టింది. అంతే కాదు, ఎంతవరకు నిజమో ఏమో కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకు,  రెడ్డి ఓటు బ్యాంకును చీల్చేందుకు, ముఖ్యమంత్రి కేసేఆర్ వైఎస్ షర్మిలను రంగంలోకి దించారని అంటారు.

రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ) స్థాపించేందుకు, ఆమె సాగిస్తున్న పాద యాత్రకు వెనక నుంచి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తోంది బీఆర్ఎస్ పెద్దలే అంటారు. అయితే, ఇప్పడు అదే షర్మిల , ఏకుమేకై కూర్చున్నారు.   కేసీఆర్ ప్రభుత్వానికి   వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు. ఈ సందర్భంగా  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.  కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో  అంటూ నినాదాలు చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల కమిషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని  మూడు రెట్లు   పెంచారని చెప్పారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మరోసారి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల సొమ్ము లక్షల కోట్లను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. 38 వేల కోట్ల ప్రాజెక్టును  లక్షా 50 వేల కోట్లకు పెంచారని చెప్పారు. మూడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచారన్నారు.

ప్రాజెక్టు వల్ల చాలా మంది నిరాశ్రుయులయ్యారని, వారికి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని వైఎస్ షర్మిల అన్నారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారని, ప్రతి ఏటా వేల ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ కేసీఆర్ తెలంగాణతో పాటు దేశ ప్రజలను సైతం మోసం చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందనీ, 2జీ, బొగ్గు కుంభకోణం కంటే.. ఇది పెద్ద స్కామ్ అని ఆరోపించారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణంలో అవినితీ చోటు చేసుకుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పడు షర్మిల ధర్నాతో, కేంద్రం కదిలితే, ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం మరో విచారణకు సిద్దం కావలసి ఉంటుందనడంలో సందేహం లేదు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.