రక్తపు మరకకు నాలుగేళ్లు

Publish Date:Mar 15, 2023

Advertisement

మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై... మార్చి15వ తేదీకి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయింది. ఈ హత్య జరిగిన తర్వాత.. వివేకా మృతదేహం తాలుక రక్తపు మరకలు అప్పటికప్పుడు ఆగంతకులు చేరిపేసి.... కడిగేసినా.. ఆ హత్య తాలుక ఏర్పడిన మరక మాత్రం పలువురిని నేటికి.. నీను వీడని నీడను నేనే.. అన్నట్లుగా ఓ నీడలా వెంటాడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా అందరి వేళ్లు పులివెందుల్లోని వైయస్ ఫ్యామిలీలోని పలువురు కుటుంబ సభ్యుల వైపే చూపిస్తున్నాయన్నది సుస్పష్టం. ఈ హత్య  కేసులో సూత్రదారులు ఎవరో.. ఈ హత్యకు సూపారీ ఎంతకు ఫిక్స్ చేశారో.. ఈ హత్యలో పాత్రదారుల్లో ఒకరైన వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి సీబీఐ ఎదుట వెల్లడించినా.. ఈ కేసు నేటికి ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. 


మరోవైపు ఈ కేసులో వరుసగా సీబీఐ విచారణకు హాజరవుతోన్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోవలదంటూ... తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ వెంటనే వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత.. ఇంప్లీడ్ పిటిషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. ఆ క్రమంలో తన ఇంప్లీడ్ పిటిషన్‌లో పలు కీలక అంశాలను వైయస్ సునీత క్లియర్‌కట్‌గా ప్రస్తావించారు. అవి ఏమిటంటే.. ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితోపాటు మిగిలిన నిందితులకు నగదు చేరిందని...వివేకా హత్యకు ముందు వైయస్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నారని... 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రి వైయస్ వివేకాను కావాలనే ఓడించారని పేర్కొన్నారు. 


అలాగే 2019 ఎన్నికల్లో వైయస్ వివేకాకు కడప లోక్‌సభ టికెట్ ఇస్తారనే ఆయన్ని హత్య చేశారని భావిస్తున్నట్లు వైయస్ సునీత.. తన ఇంప్లిడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి... వివేకా హత్యకు గురయ్యారని చెప్పినప్పటి కంటే ముందే తన తండ్రి హత్యకు గురయ్యారనే విషయం అవినాష్ రెడ్డికి తెలుసునని... ఈ హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని.. ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాష్ రెడ్డి చెప్పారని..  మా నాన్న మరణంపై అవినాష్‌కు శివప్రకాశ్ రెడ్డి సమాచారం ఇచ్చాడని.. వివేకా ఇంటికి వచ్చిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళకి గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారని.. పోలీసులు కూడా వివేకా గుండెపోటుతో పాటు రక్తపు వాంతులతో చనిపోయినట్లు అబద్దం చెప్పారని.. ఇది హత్య కాదు.. సాధారణ మరణమని చిత్రీకరించే ప్రయత్నం చేశారని.. వివేకాను తానే హత్య చేసినట్లు ఒప్పుకొంటే... 10 కోట్ల రూపాయిలు ఇస్తానని అవినాష్ రెడ్డి చెప్పినట్లు గంగాధర్ స్టేట్‌మెంట్ సైతం ఇచ్చారని.. తన ఇంప్లిడ్ పిటిషన్‌లో వైయస్ సునీత వివరించారు. తన తండ్రి హత్య కేసులో విచారణకు సహకరించకుండా.. కోర్టుల్లో వైయస్ అవినాష్ రెడ్డి తప్పుడు కేసులు వేస్తున్నాడని.. నాపై, నా కుటుంబంపైనే కాదు.. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని.... అలాగే ఏపీ ప్రభుత్వ అధికారులు అవినాష్‌ను కాపాడాలని చూస్తున్నారని.. ఆ క్రమంలో పలువురితో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. చేయిస్తున్నారని వైయస్ సునీత తన ఇంప్లీడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. 


మరోవైపు.. 2019, మార్చి 14వ తేదీ అర్థరాత్రి వైయస్ వివేకా దారుణ హత్యకు గురైనట్లు వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఘటన జరిగిన దాదాపు ఏడాదికి ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినా... ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకొంటున్నాయి. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. ఈ హత్య కేసు.. బుల్లి తెరలో ప్రసారమవుతోన్న డైలీ సీరియల్‌ను తలపించేలా.... కొ..న..సా..గుతోంది. దీంతో వివేకా హత్య వెనుక ఉన్న అసలు సిసలు సూత్రధారులు ఎవరు.. ఈ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నవేనా? లేకుంటే.. ఇతరత్రా  ఇంకేమైనా ఉన్నాయా? అని అటు వైయస్ ఫ్యామిలీ అభిమానులే కాదు.. ఇటు ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ఓ విధమైన ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.