గిరిజనులను పార్టీకి దూరం చేసిన కేసీఆర్ నిర్ణయం!?

Publish Date:Jul 25, 2022

Advertisement

తెలంగాణలో అధికార   తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ పరంగా  గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ దెబ్బ పార్టీపై తీవ్ర ప్రభావం చూపేట్టుగా  కనిపిస్తుందనేది రాజకీయ  పరిశీలకుల అభిప్రాయం. తమ వర్గానికి చెందిన నేతకు ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ వేయలేదంటూ పార్టీ తరపున ఇంత వరకూ కీలక బాధ్యతలను నిర్వర్తించిన నేత టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం ఇదే తొలిసారి.  ఢిల్లీలో టీఆర్ఎస్ మాజీ ప్రత్యేక ప్రతినిధి, ఐఏఎస్ మాజీ అధికారి రామచంద్రు తేజావత్ పార్టీకి రాజీనామా చేశారు. గిరిజన మహిళకు దేశ చరిత్రలోనే తొలి సారిగా రాష్ట్రపతి అవకాశం వస్తే.. తెరాస మాత్రం ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రామచంద్రు తేజావత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా, అందుకు ఆయన చెప్పిన కారణం రెండూ కూడా   తెలంగాణలో హాట్ టాపిక్  అయ్యాయి. తమ వర్గానికి చెందిన నేత రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలబడితే టిఆర్ఎస్ ఆమెకు  మద్దతునివ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ గిరిజన వర్గానికి చెందిన నాయకుడు, మేధావి,  ఐఎఎస్  మాజీ అధికారి పార్టీకి రాజీనామా చేయడం  పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా బాధ కలిగించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని విస్పష్టంగా వెల్లడించిన  రామచంద్రు తేజావత్ వెల్లడించారు..తన రాజీనామాను వెంటనే  ఆమోదించాలని  పార్టీ అధినేతకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

నాయకుల మధ్య అభిప్రాయభేదాలు, అసంతృప్తి, పార్టీలో గుర్తింపునివ్వడం లేదనీ, టిక్కెట్టు రాలేదనీ రాజీనామా చేయడం లేదా వేరే పార్టీలోకి జంప్ కావడం సాధారణంగా రాజీనామాలకు కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ, తమ వర్గాని(గిరిజన)కి చెందిన నేతకు మద్దతు పలకలేదనీ,  ఓటు వేయలేదంటూ ముఖ్య బాధ్యతలను నిర్వర్తించిన ఓ ఐఏఎస్ మాజీ అధికారి ప్రకటించడం, పార్టీకి రాజీనామా చేయడం.కచ్చితంగా టీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రభావం పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా  గిరిపుత్రులను టీఆర్ఎస్ నిర్ణయం  తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయమని అంటున్నారు.

ఇక ఇప్పుడు అవకాశం దక్కకపోతే ఆదివాసి రాష్ట్రపతి అవడం కలగానే మిగిలేదని ఆయన అన్నారు. దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ను తాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశానని రామచంద్రు తేజావత్ తెలిపారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థి గా నిలిపిన ప్రధాని మోడి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా తమ వర్గానికి టిఆర్ఎస్ గుర్తింపునివ్వకపోవడంతో ఓ కీలక నేత రాజీనామా చేయడంపై సొంత పార్టీని కూడా కాస్తంత విస్మయానికి లోనుచేసినట్టు పార్టీవ ర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రాజీనామా.. ఇతర వర్గాలకు చెందిన నేతల్లోనూ ఓ ఆలోచనకు ప్రేరణగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 9 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలున్నాయి. తెలంగాణలో 9.8 శాతం ఎస్టీ జనాభా ఉంది. అయితే, తెలంగాణ మంత్రి వర్గంలో కేవలం ఒక్క మంత్రి పదవిని కేటాయించడం జరుగుతూ వస్తుంది. 2014లో జరిగిన ఎన్నికల అనంతరం జరిగిన మంత్రివర్గంలో ఆజ్మీరా చందులాల్, 2018లో జరిగిన ఎన్నికల అనంతరం సత్యవతి రాథోడ్  మంత్రి వర్గంలో ఉన్నారు. కానీ, ఓసిలకు  (రెడ్డి సామాజిక వర్గానికి   6   వెలమలకు నాలుగు) మొత్తం 10  మంత్రి పదవులు, బిసిలకు 4 మంత్రి పదవులు, ఓ ఎస్సీకి, ఓ మైనార్టీకి మంత్రి పదవులు లభించాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 9.8శాతం ఉన్న గిరిజన జనాభ ఇప్పుడు టిఆర్ఎస్ కు కాస్తంత దూరం కావడం ఖాయమని పరిశీలకలు భావిస్తున్నారు.

\ముందస్తు ప్రచారం జోరుగా ఉన్న సమయంలో  ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేయడం ఇటు పార్టీ వర్గాల్లోనూ, అటు గిరిజనుల్లోనూ, ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. ఈ పరిణామం  రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ కు గిరిజన ఓట్లు చాలా వరకు తగ్గే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా , కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి కాంగ్రెస్ తో ప్రభత్వాన్ని పంచుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రంలో అధికార పార్టీ జెఎంఎం, మహారాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగానే ఉన్న శివసేన కేడా బిజెపి బలపరిచ అభ్యర్థికే మద్దతు అంటూ ప్రకటించింది. కానీ, టిఆర్ఎస్ మాత్రం మద్దతునివ్వకపోవడంపై రాష్ట్రంలో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.