నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో శనివారం (ఆగస్టు6) ఢిల్లీలో జరిగిన సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. అందుకు ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. ఆ కారణాలేమిటన్నది అందరికీ తెలిసినవే. ఇటీవలి కాలంలో ఆయన కేంద్రంపై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సందర్భంలో కూడా ఆయన ప్రొటోకాల్ ను పాటించకుండా మోడీని కలవలేదు. ఇటువంటి సందర్భాలు కనీసం మూడు ఉన్నాయి.
వీటిని బట్టి చూస్తే కేసీఆర్ మోడీకి ఎదురు పడటానికి కూడా ఇష్టపడటం లేదని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టడం ఖాయమని అంతరూ ముందే ఊహించారు. అదే జరిగింది. అయితే ఈ సారి మాత్రం ఈ సందర్భాన్ని కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలేమిటో చూచూయిగానైనా ప్రజలకు వివరించాలని, అదే సమయంలో మోడీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడానికి ఉపయోగించుకున్నారు. నీతి ఆయోగ్ విషయంలో కేసీఆర్ మోడీ సర్కార్ పై గుప్పించిన విమర్శలను పక్కన పెడితే.. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పాలనపై కురిపించిన ప్రశంసలపైనే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు గాలి వీస్తోందన్న విశ్లేషకుల అంచనాల నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహాలను అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. వరుసగా రాష్ట్రంలో రెండు సార్లు టీఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే వ్యూహాలు మార్చాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గుర్తించారు. గత రెండు ఎన్నికలకు, రానున్న ఎన్నికలకు ప్రధాన తేడా ఏమిటంటే ఆ రెండు సార్లూ కేసీఆర్ ను గెలిపించిన తెలంగాణ సెంటిమెంట్ ఈ సారి వర్కవుట్ అయ్యే అవకాశాలు లేవు. అందుకే కేసీఆర్ అభివృద్ధి, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచార చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో సమస్యల కారణంగా ఆ అభివృద్ధి ప్రచారం జనంలో ఎలాంటి ప్రభావం చూపడంలేదని అంటున్నారు.
ఇక మిగిలింది జాతీయ స్థాయిలో కేంద్రం వైఫల్యాలను ఎండగట్టడం. ఆ విషయంలోనే ఆయనకు మోడీతో చెడందంటున్నారు. ఇటు రాష్ట్రంలో ఎదురు గాలి.. అటు జాతీయ స్థాయిలో మద్దతు ఆశించినంతగా లేకపోవడంతో కేసీఆర్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఆయన వ్యూహం మార్చి కాంగ్రెస్ తో చెలిమి దిశగా అడుగులు వేస్తున్నారు. హస్తం పార్టీతో సయోధ్యకు తహతహలాడుతున్నారు. ఒక దశలో ఆయన టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కూడా సిద్ధపడ్డారన్న వార్తలు వచ్చాయి. అది నిజమైనా కాకపోయినా.. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక కూటమి కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైన తరువాత కేసీఆర్ ఇక త్వమేవ శరణం నాస్తి అన్న చందంగా కాంగ్రెస్ నే నమ్ముకున్నారని అంటున్నారు. ఇందు కోసమే కాంగ్రెస్ కోరకపోయినా సోనియా, రాహుల్ లను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనల్లో టీఆర్ఎస్ ఎంపీలను పాల్గొనాలని ఆదేశించారని అంటున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ప్రత అంశంలోనూ ఆయన కాంగ్రెస్ విధానాలకు మద్దతు పలుకుతున్నారు.
అందలో భాగంగానే నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మ కొట్టడానికి గల కారణాలను వివరిస్తూ మీడియా సమావేశంలో కాంగ్రెస్ హయాంలోనే దేశంలో సుపరిపాలన భేషుగ్గా ఉందంటూ కితాబిచ్చేశారు. స్వతంత్ర భారతంలో నెహ్రూ హయాంను స్వర్ణ యుగంగా అభివర్ణించేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత కేసీఆర్ నోట కాంగ్రెస్ ప్రశంసలు రావడం ఇదే మొదటి సారని పరిశీలకులు సైతం అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజులలో కేసీఆర్ కాంగ్రెస్ కు మరింత దగ్గరైనా ఆశ్చర్యం
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-changes-his-voice-says-niiti-aayog-waste-congress-best-39-141427.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.