చినజీయర్‌పై కేసీఆర్ సీరియ‌స్‌.. అందుకేనా?

Publish Date:Feb 13, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉగిపోతున్నారు. ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. అవును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీలపై అయన మండి పోతున్నారు. అయితే, అది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. వినిపిస్తోంది. చేతల్లో కాకపోయినా, కనీసం మాటల్లో, త్రిభాష తిట్ల రూపంలో వ్యక్త పరిచడం ద్వారా ముఖ్యమంత్రి ఎంతో కొంత ఉపసమనం పొందుతున్నారు. కానీ, పైకి కనిపించకుండా లోలోపల కేసీఆర్’ను  దహించి వేస్తున్న ఆగ్రహం ఇంకొకటుంది. అవును, చిన జీయర్ స్వామిపైనా ఆయనలో ఆగ్రహం బుసలు కొడుతోంది. అవమానమును సహితునా, అన్న విధంగా ఆగ్రహంతో కుమిలి పోతున్నారు. నిజానికి, స్వామీజీనే శపించాలన్నంతగా ఆయన లోలోన ఆగ్రహానికి గురుతున్నారు. చిన జీయర్ స్వామికి, కేసేఆర్’కు ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. నిజమే, చిన జీయర్ స్వామి కోట్ల రూపాయల ఖర్చుతో, 216 అడుగుల ఎత్తైన ‘సమతా మూర్తి’ శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని హైదరాబాద్ ముచ్చింతల్, (శ్రీరామ నగర్) ఏర్పాటు చేయగలిగారంటే, అ ఘనతలో కేసేఆర్ కాంట్రిబ్యూషన్ కాదనలేనిది. 
అయితే, చివరకు వచ్చే సరికి, స్వయంకృతమా,  ఇంకైమైనానా అనేది పక్కన పెడితే, ఎక్కడెక్కడివారో వచ్చి, పాల్గొన్న  సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలలో కేసీఆర్ ఎక్కడాలేరు.ఆటలో అరటి పండులా మిగిలిపోయారు. ఉత్సవాలు ప్రారంభమైన తొలి రోజు కేసీఆర్ వెళ్లారు, ఇక ఆ తర్వాత కేసీఆర్ కాదు తెరాస నాయకులూ ఎవరూ ఆ వైపుకు వెళ్ళలేదు. చివరకు, కన్నుల పడగగా జరిగిన సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకల్లోనూ కేసీఆర్ కనిపించలేదు. ఇందుకు అనేక కారణాలు చెపుతున్నా, తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి చూస్తే, ఆయనకు ఆహ్వానమే లేదని తెలుస్తోంది. అందుకే, శిలాఫలకం మీద ముఖ్యమంత్రి పేరు కూడా లేదని అంటున్నారు. 
విగ్రహావిష్కరణకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకున్న( ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రెస్ మీట్) పరిణామాల నేపద్యంలో ముఖ్యమంత్రి వెళ్లలేదని ని అన్నా, లేక ఆయనకు జ్వరం వచ్చి వెళ్ళ లేదన్నా అది వేరే విషయం. కానీ, కొన్ని నెలలు ముందుగా సిద్దం చేసిన శిలాఫలకంపై ముఖ్యమంత్రి పేరు లేక పోవడం నిజంగా కేసేఅర్’కు పెద్ద షాక్ అంటున్నారు. చిన జీయర్ ఉద్దేశపూర్వకంగానే, కేసీఆర్’ను దూరంగా ఉంచారని అనుకోవలసి వస్తోందని అంటున్నారు. ఇది యౌ టూ బ్రూటస్’ అన్నంతగా కేసీఆర్’ను దెబ్బతీసిందని, ఇదే కేసీఆర్ ఆగ్రహానికి మూల కారణం అంటున్నారు. 
అంతే కాదు పుండు మీద కారం చల్లిన విధంగా, సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకలలో కేసీఆర్  ప్రస్తుత ప్రధమ శత్రువు మోడీ, బీజేపీలకు, సంఘ్ పరివార్ సంస్థలకు పెద్ద పీట వేయడం కేసీఆర్ అసలు జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు. అందుకే  కేసేఆర్ చిన జీయర్ తీరుపై లోలోన చిందులు వేస్తున్నారని అంటున్నారు. 
అయితే, చిన జీయర్’ ఎందుకు కేసీఆర్’ను దూరం పెట్టారు, అంటే, కేసీఆర్’ను ఉచ్చులలో బిగించే వ్యూహంలో భాగంగానే, బీజేపే అగ్రనేతలు స్వామీజీతో సాన్నిహిత్యం పెంచుకున్నారని, అది కూడా కేసీఆర్ అగ్రహావేశాల, అనాలోచిత వ్యాఖ్యలకు కారణమని అంటున్నారు. నిజానికి సమతామూర్తిని కేసీఆర్, ఉత్తరాదిన తన ప్రచార మూర్తిగా చేసుకోవాలనుకున్నారు. జాతీయ రాజకీయాల విషయంలో ఉత్తరాదిలో హిందూ ముద్ర తనకు సమతమూర్తి ద్వారా వస్తుందనుకున్నారు. చివరకు కనీసం శిలాఫలకం మీద కూడా తన పేరు లేకపోవడంతో ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నారని అంటున్నారు. 
అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గాయన్ని’ ఇక్కడితే  మరిచి పోతారా లేక చిన జీయర్’ పైనా మోడీ పై ప్రకటించిన విధంగా యుద్దాన్ని ప్రకటిస్తారా అన్నది చూడవలసి ఉందని అంటున్నారు.అయితే, అదే సమయంలో చిన జీయర్ గుట్లు కేసీఆర్ దగ్గర వుంటే,కేసీఆర్ గుట్లు స్వామీజీ దగ్గర ఉన్నాయి. అంతేకాదు, జీయర్ వెనక ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం వుంది . సంఘ్ పరివార్ వుంది. హిందూ సమాజం వుంది. అన్నిటినీ మించి కేసీఆర్ అవసరం స్వామీజీ కంటే, స్వామీజీ అవసరం కేసీఆర్’ కు వుందని, అందుకే రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పాల్గొనే, శ్రీ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉందని, అందుకు  రెండు విపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.