ఏఐజీ ఆసుపత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు
Publish Date:Jun 13, 2025
Advertisement
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగా గులాబీ బాస్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్‌కు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాధారణ గ్యాస్ట్రిక్ టెస్టులు చేసినట్లు వెల్లడించారు. కాగా గతంలోనూ పలుమార్లు ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వచ్చిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-39-199877.html
http://www.teluguone.com/news/content/kcr-39-199877.html
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 30, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 26, 2026
Publish Date:Aug 26, 2026





