కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్!

Publish Date:Mar 27, 2026

Advertisement

 

తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా పార్టీగా నామకరణం చేసిన నూతన పార్టీని ఏప్రిల్ 25 తేదీన ఉదయం 10గం.లకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్‌లోని మునిరాబాద్‌లో పార్టీ ప్రకటిస్తానని, అదే రోజు పార్టీ జెండా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తం ఉందన్నారు.  రాముని ఆశీర్వాదంతో పార్టీ ప్రకటన తేదీని నిర్ణయించామని ముహుర్తాలపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. వారణాసి వెళ్లి గంగా స్నానం చేసి పార్టీ నీ లంచ్ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు. 

వాస్తవానికి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు పార్టీని, జెండాను ఆవిష్కరించనున్నట్లు కవిత ప్రకటించడం విశేషం. ఏఏ అంశాలపై కొత్త పార్టీ పోరాటం చేయాలో తమ దృష్టికి తీసుకురావాలని కవిత శ్రీరామ నవమి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందంటున్న కవిత, తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత  ఉద్యోగాల కోసం వేచి చూడాల్సి వస్తోందని పరోక్షంగా బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.  తమ కొత్తపార్టీ ద్వారా యువత కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని. యువత, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కవిత వెల్లడించారు. 

జాగృతి సంస్థ ద్వారా బీసీలు, దళితుల హక్కుల కోసం పోరాటం చేశామని,  పార్టీ ఆవిర్భావం నాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు,యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత కోరారు.  మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్ధ...రాజకీయ పార్టీగా మారబోతుందిప్పుడు. తమ పార్టీ ఎవరికీ బీ పార్టీ కాదని ....తమది నెంబర్ వన్ పార్టీగా ఉండబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. కొత్త పార్గీ నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో సలహాలు ఇవ్వాలని ,   అందుకోసం ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేస్తామని, అలాగే మెయిల్‌కి మేసేజ్ చేయవచ్చన్నారు. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత,  అప్పటిలోగా.. అంటే రానున్న 28 రోజుల్లో ప్రతి ఒక్కరినీ కలుస్తానని ప్రకటించారు.. తెలంగాణ ఉద్యమకారులు, యువత, మహిళలు, మెథావులు, కవులు, పాత్రికేయులు అందరితో చర్చిస్తామన్నారు.

By
en-us Political News

  
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.