ఐదేళ్లు సీఎంగా ఉన్న జగన్ విషయపరిజ్ణానం..డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒకటేనట.!

Publish Date:Aug 20, 2026

Advertisement

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరో సారి తన అజ్ణానాన్ని బయటపెట్టుకుని ట్రోలింగ్ కు కేంద్ర బిందువయ్యారు. పాపం జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు అంటూ నెటిజనులు ఆటపట్టిస్తున్నారు. గురువారం (ఆగస్టు 20) మీడియాతో మాట్లాడిన జగన్  డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్( ఏపీపీఎస్సీ) రెండూ ఒకటేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈయనా ఏపీ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు వెలగబెట్టారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  మెగా డీఎస్సీపై విమర్శలు గుప్పించే క్రమంలో  ఆయన తన అజ్ణానాన్ని బయటపెట్టుకున్నారు. 

ఓ వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పారదర్శనంగా నిర్వహించామని చెబుతూ.. పక్కా ఆధారాలు చూపుతున్నా.. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ వేసిన పిటిషన్లను కోర్టులు డిస్మిస్ చేసినా.. జగన్ మాత్రం తన మీడియా సమావేశంలో మెడా డీఎస్సీలోఅక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ఐటీ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంత వరకూ అయితే ఓకే.. కానీ ఆయన ఆ క్రమంలో అసలు   ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్,    టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ రెండూ ఒకటేనన్నారు.  తన హయాంలో  నిర్వహించిన ఏపీపీఎస్సీ, తెలుగుదేశం హయాంలో నిర్వహించిన డీఎస్సీ ఒకటేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు పని చేసిన జగన్   ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరిజ్ణానం కూడా లేకపోవడమే ఆయన హయాంలో పాలన ఎంత ‘దివ్యం’గా సాగిందో తేటతెల్లం చేస్తోందంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. ఒక మాజీ సీఎం అయ్యి ఉండి కూడా ఏపీపీఎస్సీ, డీఎస్సీలకు మధ్య ఉన్న వ్యత్యాసం తెలియపోవడమేంటని నిరుద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా జగన్ తన అజ్నానాన్ని, విషయపరిజ్ణానం లేని తనాన్ని బయటపెట్టుకుంటూ డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనని చెబుతున్న సమయంలో ఆయనను కరెక్ట్ చేయడానికి పక్కనే ఉన్నవారు ఎంత ప్రయత్నించినా జగన్ మాత్రం రెండూ ఒకటే కదా అంటూ వారిని నోరుమూయించారు.  

నెటిజనుల ట్రోలింగ్, నిరుద్యోగల విమర్శలు పక్కన పెడితే.. జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్.. ప్రెస్ మీట్ క్లిప్పింగ్ లను షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు.  మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.    రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఏల్ల తరబడా గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతుంటే, మాజీ సీఎం, పైగా ప్రతిపక్ష హోదా కావాలంటూ మంకుపట్టు పడుతున్న జగన్ కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య ఉన్న తేడా తెలియకపోవడం విస్మయం గొలుపుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం జగన్ చేసిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటే అన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారడమే కాదు.. జగన్ ప్రతిష్టను దిగజార్చాయి. 

Jagan APPSC DSC comments, Nara Lokesh trolls Jagan, AP Mega DSC news,   Jagan press conference, Andhra Pradesh, TeluguOne

By
en-us Political News

  
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.