తెలుగు ప్రజల ఐక్యతకు కల్వకుంట్ల కవిత పిలుపు.!
Publish Date:Jul 13, 2026
Advertisement
రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు అయినా... ఉభయ తెలుగురాష్ట్రాల మధ్యా ఎన్ని విభేదాలు ఉన్నా.. తెలుగు ప్రజలు ఎప్పుడూ ఐక్యంగానే ఉండాలని టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ భాషా యాసలు, సంస్కృతిపై జరుగుతున్న కొన్ని వివాదాల నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరు రాష్ట్రాల పరంగా విభేదాలు ఉండొచ్చు.. రాజకీయంగా భిన్నమార్గాలలో పయనిస్తుండొచ్చు.. కానీ.. ప్రజలుగా తెలుగువారు ఐక్యంగా ఉండాలన్నారు కల్వకుంట్ల కవిత. రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే శక్తిమంతమైన మాధ్యమం సినిమా అన్న ఆమె.. సాంస్కృతిక బంధాలు రాజకీయాల కంటే మిన్నవన్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర, తెలంగాణ యాసలపై, సంస్కృతిపై కొన్ని చిత్రాల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒకరి భాషను మరొకరు తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల నెటిజన్ల మధ్య సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో మాటల యుద్ధం జురుగుతోంది.. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత్రి కతిత సాంస్కృతిక ఐక్యతకు పిలుపునివ్వడం విశేషం. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగు వారంతా ఒకే కుటుంబంగా ముందుకు సాగాలని, సినిమా వంటి కళా రూపాలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కవిత ఆకాంక్షించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలపై అటు సినీ వర్గాల నుంచి, ఇటు ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. Kavitha calls for unity og telugu people, Cinema, Cultural, Bridge, Telangana, Andhra Pradesh, Teluguone
http://www.teluguone.com/news/content/kavitha-calls-for-unity-og-telugu-people-39-225907.html





