కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్‌.. మోడీనే టార్గెట్..

Publish Date:Sep 28, 2021

Advertisement

కాంగ్రెస్ పార్టీ కొత్తగా అడుగులు వేస్తోంది. ఇంతవరకు సాగిన వరస పరాజయాలకు, పరాభవాలకు ఇక చుక్క పెట్టాలని నిర్ణయానికొచ్చింది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కొత్త బాటలో ముందుకు వెళ్లేందుకు నూతన విధానాలతో సిద్దమైంది. ఒకవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కొత్త కాంగ్రెస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అనవచ్చును.  

యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి ఏ రాష్ట్రానికి ఆ  రాష్ట్రంలో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు చక చకా అడుగులు  వేస్తోంది. ఈ ప్రయోగం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలో సక్సెస్ అయిన నేపధ్యంలో ఇప్పుడు అదే ఫార్ములాను ఇతర రాష్ట్రాలకు చివరకు జాతీయ స్థాయిలోకి విస్తరించేందుకు పక్కా  ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన, ఇద్దరు యువనాయకులు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సిపిఐ నాయకుడు కన్హయ్య కుమార్‌, రాష్ట్రీయ దళిత అధికార మంచ్‌ (ఆర్‌డీఏఎమ్‌) ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని కాంగ్రెస్ గూటికి చేర‌డం ఆస‌క్తిక‌రం.  

కన్హయ్య కుమార్‌, గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా, పార్లమెంట్ పై దాడి కేసులో ఉరి తీయబడిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు, అనుకూలంగా విశ్వవిద్యాలయంలో విద్యార్ధులను కూడ‌గట్టి, నినాదాలు చేయడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించారు. అంతే కాదు కన్హయ్య కుమార్‌ పై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత  కన్హయ్య కుమార్‌ 2019 లోక్ సభ ఎన్నికల్లో బీహార్’లోని బెగుసరాయ్ లోక్ సభ స్థానం నుంచి సిపిఐ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడి పోయారు. ఎన్నికలలో ఓడిపోయినా, సీఏఏ వ్యతీరేక ఆందోళనలో, రైతుల ఆందోళనలో కీలక పాత్రను పోషించారు. మంచి వక్త. కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని,  సంఘ్ పరివార్  సంస్థలను ఏకి పారేయడంలో కన్హయ్య కు కన్హయ్యే సాటి. ఆయనకు ఆయనే పోటీ. అందుకే, కన్హయ్య కుమార్‌ కాంగ్రెస్‌లో చేరి బీహార్‌ పార్టీని బలపరుస్తారని భావిస్తున్నారు. అయితే  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉండటంతో యువతను బాగా ఆకర్షించే కన్హయ్య కుమార్‌ను ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్‌ భావిస్తోందని సమాచారం. 

ఇక, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం  గుజరాత్‌లోని వడ్గామ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నాయకుడు, ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీని కాంగ్రెస్‌ రాష్ట్ర విభాగానికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలున్నాయి. కాగా, సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్, యువ నాయకుడు రాజీవ్‌ సతావ్‌ మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్‌ మేవాని పార్టీలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, రాహుల్ గాంధీ టీమ్’ గా ఎమర్జ్‌ అవుతున్న యువ నేతలపై సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయన్న ఆరోపణలు అప్పుడే మొదలయ్యాయి. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడవలసి ఉందని అంటున్నారు.
 

By
en-us Political News

  
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.