మరో మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత?!

Publish Date:Jan 31, 2025

Advertisement

కల్వకుంట్ల కుటుంబాన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా స్కాంలు చుట్టుముడుతున్నాయా? అవినీతి, అక్రమార్జన విషయంలో వారు ఆరోపణల ఊబిలో కూరుకుపోయారా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తుంటే ఔననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖరరావు కుమార్తె, కుమారుడూ కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఇప్పటికే అరెస్టై బెయిలుపై ఉన్నారు. ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిండా మునిగి ఉన్నారు. ఈ విషయంలో నిధుల మళ్లింపు జరిగిందనీ, దానిలో కేటీఆర్ ప్రమేయానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనీ కోర్టులు కూడా వ్యాఖ్యానించాయి. ఆయనకు ముందస్తు బెయిలు తిరస్కరించాయి. ప్రస్తుతం ఆయన ఏసీబీ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్నారు. 

ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై బెయిలుపై విడుదలైన కవితపై అదే మద్యం విషయంలో మరోమారు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సారి ఆరోపణలు కేరళ మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి వచ్చిన తరువాత చాలా కాలం పాటు మౌనాన్ని ఆశ్రయించిన కవిత ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ.. రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. అంతలోనే కేరళ మద్యం విధానంలోనూ కుంభకోణం జరిగిందనీ, అందులో కూడా కవిత ప్రమేయం ఉందనీ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆరోపణలకు చేసింది కేరళ విపక్ష నేత వీడీ సతేషన్ చేశారు.  
ఢిల్లీలో జరిగిన విధంగానే కేరళలోనే మద్యం విధానంలో పెద్ద కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రధాన పాత్ర పోషించారనీ ఆయన ఆరోపించారు. కవిత పలుమార్లు కేరళ వచ్చి ఓ కంపెనీకి మద్యం ప్లాంట్ల కోసం లాబీయింగ్ చేశారని సతేషన్ ఆరోపణలు గుప్పించారు. కేరళలో అధకారంలో ఉన్న వామపక్ష కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే ఇదంతా జరిగిందన్న నతేషన్ కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావించడం ప్రాధాన్యత  సంతరించుకుంది. 
కేరళలో ఈ మద్యం కుంభకోణం 2023లో జరిగిందని చెప్పిన ఆయన  పాలక్కాడ్‌లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ లిమిటెడ్ పేరుతో భారీగా భూములు సేకరించారని , ఎక్సైజ్ చట్టంలో  మార్పులు చేసి మరీ ఆ సంస్థకు మద్యం తయారీ లైసెన్సు మంజూరు చేశారని సతేషన్ ఆరోపించారు.

కేరళ ముఖ్యమంత్రి  పినరయి విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ లు ఏకపక్షంగా వ్యవహరించి మరీ లైసెన్సులు మంజూరు చేశారన్నారు.  ఇదంతా కల్వకుంట్ల కవిత కేరళ వచ్చి పెద్దలతో భేటీల తరువాతే జరిగిందని సతీష్ ఆరోపణ. ఈ ఆరోపణలను కవిత ఖండించారు. అయితే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టై బెయిలుపై ఉన్న నేపథ్యంలో తాజా ఆరోపణలపై ఆమె ఖండనలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు సరికదా.. నిప్పు లేకుండా పొగరాదుగా అని వ్యాఖ్యానిస్తున్నారు. 

By
en-us Political News

  
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.