రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు సందీప్ కుమార్ పిలుపు.!
Publish Date:Nov 22, 2026
Advertisement
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు. నేతలంతా ఐకమత్యంతో పనిచేయడం వల్ల 64 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. రాష్ట్రంలో కరవు పరిస్థితులను అధిగమిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తగిన సహాయ సహకారాలు అందించడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా.. కరువు పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజల అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పనితీరు దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు. గతంలో తెలంగాణలో ఏఐసీసీ ఇన్ఛార్జ్లుగా పనిచేసిన నేతలు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే లక్ష్యంతో పార్టీ శ్రేణులు మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సోనియాగాంధీ రచించిన 'బిలాంగింగ్' పుస్తకానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు. సోనియాగాంధీ చేసిన త్యాగాలు, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల బలిదానాలు దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రాజకీయంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేసి.. రాబోయే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని బి.ఎం. సందీప్ కుమార్ కోరారు. ఇది కూడ చదవండి: నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రభాస్ మద్దతు: ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి [ Telangana Congress PAC meeting, BM Sandeep Kumar, Rahul Gandhi, Sonia Gandhi, Telangana Congress, Congress Party, AICC, Congress Leadership, 64 Assembly Seats, Telangana Government, Congress Workers, BJP, RSS ]
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజారిటీతో, మరిన్ని స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు.
http://www.teluguone.com/news/content/telangana-congress-pac-meeting-39-237710.html




