Publish Date:Jul 17, 2025
కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అంటారు సీఎం రేవంత్. కానీ ఇక్కడ సీన్ చూస్తే అది కొందరు ఉన్నతాధికారుల పాలిట కాసుల కల్పవృక్షం అన్నది తెలుస్తోంది. మొన్న హరిరాం అనే ఈఎన్సీ పట్టుబడితే అతడి అక్రమాస్తుల విలువ వంద కోట్లు. అదే ఓపెన్ మార్కెట్లో రెండు వందల యాభై కోట్లు. తర్వాత నూనె శ్రీధర్ అనే మరో ఈఈ పట్టుబడితే ఇతడి ఆస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు ఏసీబీ అధికారులు. అయితే దీని మార్కెట్ వాల్యూ 450 కోట్ల వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అనే ఈ పెద్దమనిషి అక్రమాస్తుల విలువ 200 కోట్లుగా లెక్కించారు. దీని ఓపెన్ మార్కెట్ వాల్యూ కూడా 450 నుంచి ఐదు వందల కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఈ ముగ్గురి అక్రమాస్తుల విలువే వెయ్యికోట్ల పై మాట.
ఈ ముగ్గురి అక్రమార్జన కథ ఒక్కొక్కొరిదీ ఒక్కో ప్రత్యేక అవినీతి అధ్యాయంగా చెబుతారు. శ్రీధర్ తన అక్రమార్జన ద్వారా వచ్చిన డబ్బు ఏం చేయాలో అర్ధం కాక కొడుకు పెళ్లి థాయ్ ల్యాండ్ లో చేశారట. ఇక మురళీధర్ రావు తన కొడుకును ఒక కంపెనీలో బలవంతానా డైరెక్టర్ గా చేసి.. ఈ కంపెనీకి కాళేశ్వరం సబ్ కాంట్రాక్టులు వచ్చేలా చేసి.. తద్వారా తన అవినీతి సొమ్ము ఏరులై పారించారట.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పదవీకాలం పూర్తయిన ఈ ఈఎన్సీని అదే పనిగా.. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే మురళీధరరావు అనే ఈ ఈఎన్సీ అవినీతి సరళి ఎలా సాగిందంటే.. ప్రతి సంతకానికి విలువ కట్టడం. బిల్లులు ఆపేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి.. ఆపై తన బంధు మిత్రులకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించడం.. ఇదీ ఈయనగారి నిర్వాకం. దీంతో కుప్పలు తెప్పలుగా అక్రమాస్తులు కూడబెట్టిన ఘనత ఈయన సొంతంగా చెబుతున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.
పై స్థాయి అధికారులే ఒక్క కాళేశ్వరం పేరు చెప్పి వెయ్యి కోట్ల పైగా కూడేస్తే.. కింది స్థాయి అధికారుల మాటేంటి? ఆపై ఈ మొత్తం ప్రాజెక్టు రూపకల్పన చేసిన ఆ పై స్థాయి వారి మాటేంటి? అన్నదిప్పుడు ఎవరికీ అంతు చిక్కడం లేదట.
ఈ ప్రాజుక్టును 80 వేల 500 కోట్లతో మొదలు పెట్టగా.. దాని అంచనా వ్యయాలను అంచలంచలుగా పెంచీ పెంచీ లక్షా ముప్పై వేల కోట్లకు చేర్చారట. ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టునే వంద సార్లకు పైగా.. రివైజ్ అంచనాలను పెంచి ప్రాజెక్టు కాస్ట్ పైపైకి ఎగబాకేలా చేశారట. దీన్నిబట్టీ ఈ ప్రాజెక్టు కూలేశ్వరమా.. లేక కాసులు రాల్చేశ్వరమా? అర్ధం చేసుకోవాలంటారు ఇరిగేషన్ నిపుణులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kaleswaram-corruption-sky-is-the-limit-39-202119.html
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.