పదవుల కోతలో సీఎం పై డీఎల్ ఫైర్
Publish Date:Feb 7, 2012
Advertisement
కడప: తాను ఎవరికీ చెంచాగిరి చేయలేదని, అలా చేయను కూడా అని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పదవుల కోత విషయంలో ఆయన ఇలా ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను విమర్శించినందు వల్లనే కోత కోస్తే నన్ను పదవి నుండే తప్పించ వచ్చునని అన్నారు. తనకు పదవి ఉన్నా లేకున్న ప్రభుత్వ పథకాల వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. తాను పని చేయలేదని శాఖలపై కోత కోసి ఉంటే తనకు మంత్రి పదవే అవసరం లేదని ఆయన మండిపడ్డారు. ఆరోగ్య శాఖలో జరిగిన కొన్ని సంఘటనలకు తాను బాధ్యుడిని కానన్నారు. జూడాల విషయంలో నా వైఫల్యం లేదన్నారు. తనది ముక్కుసూటిగా వ్యవహరించే తత్వమని, ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. ఉప ఎన్నికల్లో తన ప్రమేయం ఉండదన్నారు. ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే బాధ్యత వహించాలన్నారు. తనకు ఎవరితో విభేదాలు లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతానని అన్నారు.
http://www.teluguone.com/news/content/kadapa-24-11659.html





