కే.ఏ.పాల్ ప్రొడక్షన్స్ ‘గోప్ఫ’ కామెడీ

Publish Date:Jun 5, 2022

Advertisement

వెర్రి వేయివిధాలన్నారు. ఈ పాలుగారిది మరొక విధం. ప్రభు దర్శనం అయిందని ప్రచారం చేసుకున్న కె.ఎ.పాలు గారిది పాలుతాగే వయసు కాదు. ఆయన దృష్టిలో మనమే పిల్లలం.. దేశ ప్రధానితో సహా! పాలుగారికి విదేశాల్లో వూహించనంత వీర ఫాలోయింగ్‌ వుందని ఆయన అనుచరులతో పాటు స్వయంగా ఆయనే తెగ ప్రచారం చేసుకుంటుంటారు. లోకంలో ఏ దేశ ప్రధాని, ప్రెసిడెంట్‌ ఆఫ్‌ అమెరికా అయినా సరే పాలుగారి సువార్త చచ్చినట్టు వినితీరాల్సిందే. లేకపోతే ఆయనకు దేశ పాలన సాగదు. కె.ఎ.పాల్‌ గారికి భగవంతుడు ఇచ్చిన గొప్పవరం అది. దీన్ని కాదనే హక్కు స్వయానా పాల్‌ గారికే లేదు. ఎందుకంటే ఆయన నిఝంగానే ప్రపంచనేతలతో మాట్లాడేంత చనువు, వీలయితే ప్రపంచ యుద్ధాలను అమాంతం ఆపేయగల శక్తి కలిగినవాడు గనుక. చిత్రమేమంటే, అవేమీ చేయలేదు, అంత సులువుగా జరిగిపోయేవీ కావు.

లోకాన్ని వుద్ధచించాలని దైవాంశసంభూతులకు వుంటుంది. వారు మంత్రిలాగా సలహాలు.. అపుడపుడూ ఇవ్వడం విన్నాం, సినిమాల్లోనూ చూసేం. కానీ లోకాన్ని వుద్ధరించడమన్నది నావల్లే సాధ్యం.. లాభంలేదు మిత్రమా.. ధైర్యం చేయి ఢింభకా.. అని లోలోపల నాలుగు ధైర్య వచనాలు చెప్పుకుని ఏకంగా రాజకీయరంగంలోకి దిగడాన్ని పిచ్చికి పరాకాష్టగాక మరేమంటారు. ఏపీలోని ఉత్తరాంధ్రలో ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి, దేశాన్ని ఉద్దరించే పాత్రలో దేశాటన చేస్తూ చక్కగా నవ్వుతూ తన అజ్ఞానాన్ని చాలా సరదాగా, చాలా సీరియస్‌గానూ తెలియజేసుకోవడం కేవలం కె.ఎ.పాల్‌ కి మాత్రమే సాధ్యం! తాను ఏది చెబితే అది ప్రపంచ నేతలు వింటారు, వింటున్నారని అంటూంటారు. మరి మన ప్రధానితో టీ తాగుతూ.. 'నాయనా, ముందు ప్రజలను ఉద్దరించు, వారి కష్టాలను తెలుసుకుని వారి అభివృద్ధికీ నాలుగు అడుగులు వేయి, ఎంతసేపూ అంబానీ, అదానీలే కాదు ఇంకా ప్రజలు వున్నారు' అని చెప్పారా! లేదు.

సామాజంలో అన్యాయాలు, అక్రమాలు, హింసా పెరిగిపోతున్నాయి. సామాన్యులను ఆదుకోవాలని పాల్‌ చాలా అనుకుని రాజకీయాల్లోకి వచ్చేరట. మతప్రచారకులుగా ఎంతో పేరున్న పాల్‌గారికి రాజకీయాల రొంపిలో దిగితేనే అనుకున్నవి సాధ్యమవుతాయని గట్టి నమ్మకం కలగడమే విచిత్రం. ఈ ఆలోచన మరే ఆధునిక భక్తాగ్రేసుడుకీ తట్టలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు వెన్నంటి వుండే వీరాభిమానులు లెక్కకు మించి వున్నారని ప్రతీ సందర్భంలో పాల్‌ అందరికీ గుర్తు చేస్తుంటారు. ఎవరైనా మైకులో మాట్లాడుతూంటే అమాంతం గుమిగూడడం ఇక్కడి ప్రజల తత్వం. వాళ్లకో సరదా, కాలక్షేప మూను. దాన్ని వీరాభిమానం అనుకోవడం, ఓటుబ్యాంకు అనుకోవడమే అమాయకత్వం. అన్ని రాజకీయపార్టీల వారి మాదిరిగానే పాల్‌గారూ ఆ అమాయకత్వంలో పడ్డారు.

నలుగుర్ని వెంటేసుకుని గట్టిగా మాట్లాడ్డం వంటపట్టించుకున్నారు. కానీ ఏంమాట్లాడుతున్నాను అనేదే అప్పుడు దారితప్పుతుంటుంది. ఓటు బ్యాంకును కొల్లగొట్టి రాజ్యాధికారం చేపట్టడానికి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలవారు విశ్వయత్నం చేస్తుంటారు. కానీ పాల్‌ మాత్రం హేమాహేమీలయిన పార్టీలవారినే అంటే ఎన్నో ఏళ్ల రాజకీయానుభవం, బలగం వున్న నాయకులనే చచ్చుకుంటూ తనకు మద్దతునివ్వమని, అది వారి భవితకు ఎంతో మంచిదన్నది పాల్‌ ప్రవచనం. వొట్టి బోళామనిషి అనుకునేరు.. వొట్టి వెర్రితనం! లేకపోతే ఏ పార్టీ అయినా తన వల్లనే గెలుస్తుంది, తనను ఆశ్రయిస్తేనే మనుగడ సాగిస్తుందని భావించడం ఎప్పుడూ కనీ వినీ ఎరుగం.

ప్రపంచదేశాధినేతలతో సరదా కబుర్లు చెప్పగలిగేంత పాల్‌ భారతదేశంలో, మీదుమిక్కిలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవమానాలు పడాలా తనను చాలా ఈజీగా తీసుకుంటున్నారు జాగ్రత్త అని హెచ్చరించాలా బైబుల్‌ పాఠాలు చెప్పి వేలాదిమందిని దగ్గరచేసుకోవచ్చు, భక్తులుగా మార్చుకోవచ్చు. ఆయనకు ఆ సత్తా వుండవచ్చు. కానీ ఈ రొంపి రాజకీయాల్లో, వ్యూహకర్తల మధ్య, ఏనుగులు, సింహాల నడుమ పిరికితనంతో కూడిన భయంతో మాటలు తడబడుతూ తిరగడం దేనికి లోకాన్ని వుద్ధరించడానికి అవతరించారా మహామహా నాయకులే పావులు నడపలేక ఏదో ఒక సమయంలో దెబ్బతిన్నారు. ఎంతోకాలం నుంచీ రాజకీయబురదలో కొట్టుకుంటున్నవారున్నారు. విదేశాల్లో ప్రవచనాలు చెప్పుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని సాగించుకోవలసిన కె.ఎ.పాల్‌గారికి ఈ రాజకీయాల నదిలో తలమునకలు కావాలని ఎవరు ప్రవచించారో వారికి పాదాభివందనాలు.

ఏమయినప్పటికీ, కె.ఎ.పాల్‌ రాజకీయ ప్రవేశం, ప్రయాణం ఈ కాలపు గొప్ప కామెడీ! దీనికి రచన, దర్శకత్వం అన్నీ ఆయనే. అహింసామార్గాన పయనించాల్సినవారు ఈ దారుణమార్గంలోకి మళ్లడానికి గల గట్టి కారణాలు తెలిస్తే బాగుండు. స్క్రిప్ట్‌ మరో విధంగా మార్చమని దేవుని ప్రార్ధించేది దేశమంతా!

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.