తలుపు చెక్కతో నువ్వొకటి..తమల పాకుతో నేను రెండు..!

Publish Date:Jun 5, 2022

Advertisement

కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి తననెవరూ చూడటం లేదనుకుంటుందట. బీజేపీ పరిస్థితీ అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్. చేసేదొకటి, చెప్పేదొకటీగా ఆ పార్టీ తీరు ఉందని పరిశీలకులు అంటుంటే. చెబుతున్నదీ, చేస్తున్నదీ ఒకటే లా ఉందని జనాలు నవ్వుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే రాష్ట్రంలో అధికార పార్టీకి మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటూ.. మరో వైపు జనసేనతో మైత్రి కొనసాగించడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఏపీ బీజేపీలో కాగడా పెట్టి వెతికినా కార్యకర్తలు కనిపించరు. కేడర్ లేని పార్టీకి నేతలు బోలెడంత మంది. అందరూ ఎవరి మటుకు వారు మీడియా సమావేశాలు పెట్టి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేస్తారు. అయితే జనం పట్టించుకోవడం లేదన్న బాధ వారిని వెంటాడుతోంది.

బీజేపీ ఆత్మకూరులో పోటీ చేయడానికి అధికార పక్షానికి ఆ ఉప ఎన్నికలో చుక్కలు చూపడానికే అని ఎంతగా చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు సరికదా.. వైసీపీ కోరింది కనుకే పోటీ బీజేపీ అక్కడ పోటీలో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా ఒకే సమయంలో ఇటు జనసేనతోనూ, అటు వైసీపీతోనూ మైత్రి కొనసాగిస్తూ ప్రజలలోనే కాదు.. ఆ పార్టీని అభిమానించే ఒకరిద్దరిలో కూడా చులకన అయిపోతున్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ నాయకుల ప్రసంగాలూ, ఎంపీ జీవీఎల్ లాంటి వారి ఆవేశపూరిత ప్రసంగాలూ జనానికి మంచి వినోదాన్ని పంచుతున్నాయి.

అయితే ఇప్పుడు ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకుడు నడ్డా ఏపీకి వస్తున్నారు. ఆయన మాటలు కూడా ఇక్కడి జనం పట్టించుకోకపోతే.. జాతీయ స్థాయిలో పార్టీ పరువు పోతుందన్న భయం బీజేపీని వెంటాడుతోంది. ఇప్పటి దాకా బీజేపీ అధికార పార్టీపై, జగన్ ప్రభుత్వంమై విమర్శలు చేస్తూ వచ్చింది కానీ, వైసీపీ నుంచి కానీ, జగన్ సర్కార్ లోని మంత్రుల నుంచీ కానీ చిన్న పాటి ఖండన కూడా రాలేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కాస్త ఆలస్యంగానైన సరే గమనించింది.

ఇఫ్పుడు నడ్డా రాష్ట్ర పర్యటన నేపథ్యంలో  తమ విమర్శలకు ప్రభుత్వం నుంచి చిన్న పాటి ఆయన స్పందనైనా రావాలని, ప్రతి విమర్శ ఉండాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే తలుపు చెక్కతో నేను.. తమల పాకుతో నువ్వు అంటూ ప్రభుత్వాన్ని, వైసీపీని బతిమలాడుకుంటోంది. తాజాగా విష్ణు వర్థన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలలో పదును పెంచుతూ మీడియా ముందుకు రావడానికి కారణమదే. కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తానన్నట్లుగా జగన్ మాట్లాడటాన్ని డ్రామాగా అభివర్ణిస్తూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

హస్తిన వెళ్లి కేంద్రం పెద్దలతో భేటీల వివరాలు వెల్లడించకుండా డ్రామాను రక్తికట్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శిస్తూ జగన్ దంతా పోలిటికల్ మైండ్ గేమ్ గా అభివర్ణించారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయన్నట్లుగా బిల్డప్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని పలుచన చేయడానికి జగన్ కుట్ర చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి మాటలతో ఒక్క సారిగా వైసీపీ నుంచి బీజేపీవై విమర్శల వర్షం కురుస్తుందని ఆయన భావిస్తున్నట్లున్నారు.  ఇప్పటికే వైసీపీకి బీజేపీకి కేంద్ర స్థాయిో మంచి సపోర్ట్ ఉందని  రాష్ట్ర స్థాయిలో పార్టీని నడుపుతున్న వారంతా జగన్ భజనలోనో, సేవలోనే తరిస్తున్నవారేనని జనం భావిస్తున్నారు.

పరిశీలకులు కూడా తమ విశ్లేషణల్లో అదే చెబుతున్నారు. జనసేనాని తన ఆప్షన్లతో బీజేపీకి దాదాపు ఒక అల్టిమేటమ్ ఇచ్చేశారనే పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అగ్రనాయకుల ఏపీ పర్యటనలో వైసీపీ తమ రాజకీయ ప్రత్యర్థి అంటూ ప్రసంగాలు చేసి జనాలను నమ్మించగలరా? నవ్వుల పాలౌతారా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కూడా అదే సందేహం తొలిచేస్తున్నది.దీంతో సోము వీర్రాజు వంటి స్థానిక నాయకులతో లాభం లేదని విష్ణువర్ధన్ రెడ్డి, జేవీఎల్ వంటి వారు రంగంలోకి దిగి వైసీపీపై విమర్శల దాడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.  

జనసేనతో పొత్తు కొనసాగుతుందనీ, ఆ పార్టీతో కలిసి రాష్ట్రంలో అధికారం చేపడతామని చెప్పుకుని నమ్మించడానికి నానా తంటాలూ పడుతున్నారు. అయితే బీజేపీ, వైసీపీ రహస్య  పొత్తుపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం వైసీపీది అధికారం, బీజేపీది పెత్తనంలా సాగుతోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామంటూ బీజేపీ ఉడుత ఊపులు ఎవరిని బెదరించడానికి, ఎవరిని నమ్మించడానికి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు, జనం ఎగతాళి చేస్తున్నారు. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.