బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో రహమత్‌నగర్‌లో ముఖ్యమంత్రి రోడ్‌షో చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేయిల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన ప్రధాని మోదీ, అమిత్‌షా ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మంత్రి హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈనెల 11లోగా వారిని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఫార్ములా ఈరేసు పేరుతో రూ.50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
విచారణ జరిపి గవర్నర్‌కు పంపితే ఇప్పటివరకు అరెస్ట్ అనుమతి ఇవ్వలేదని సీఎం అన్నారు. కారు పార్టీ కమలం పార్టీ ఫెవికాల్ బంధం ఉందని పేర్కొన్నారు. 2007లో పి.జనార్దన్‌రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక వస్తే కేసీఆర్, టీఆర్‌ఎస్ క్యాండెట్‌ను పోటీలో నిలబెట్టారని సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వచ్చే ప్రతి ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అధినేత అభ్యర్థిని పెట్టారని రేవంత్ అన్నారు. రెండేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌లో 14,159 రేషన్ కార్డులు మంజూరు చేశామని నవీన్ యాదవ్ గెలిపిస్తే 4 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి 30 వేల మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని ముఖ్యమంత్రి విశ్వసం వ్యక్తం చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jubilee-hills-election-39-209022.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!