జూబ్లీహిల్స్‌లో హస్తానిదే హవా...తేల్చిచేసిన ఎగ్జిట్ పోల్స్
Publish Date:Nov 11, 2025
Advertisement
తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేసినందుకు ఆమెను, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్నవారికి.. ఓటు వేసేందుకు అధికారులు ఛాన్స్ ఇచ్చారు పీపుల్స్ పల్స్: నాగన్న సర్వే: ఆపరేషన్ చాణక్య: JANMINE సర్వే: ఆరా మస్తాన్ సర్వే :
చాణక్య స్ట్రాటజీస్
కాంగ్రెస్ 46%, బీఆర్‌ఎస్ 43%, బీజేపీ 6% ఓట్లు
కాంగ్రెస్ 48%, బీఆర్‌ఎస్ 41%, బీజేపీ 6% ఓట్లు
కాంగ్రెస్ 47%, బీఆర్‌ఎస్ 41%, బీజేపీ 8% ఓట్లు
8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌దే విజయమని సర్వే
కాంగ్రెస్‌కు 42.5%, బీఆర్‌ఎస్ 41.5%, బీజేపీ 11.5% ఓట్లు
కాంగ్రెస్ 47.49% బీఆర్‌ఎస్ 39.25%, బీజేపీ 9.31% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది
http://www.teluguone.com/news/content/jubilee-hills-byelection-39-209363.html





