Publish Date:Nov 11, 2025
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. మంగళవారం (నవంబర్ 11) రెండో విడత పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో బీహార్ లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎన్డీయే కూటమే అని పేర్కొన్నాయి. అయితే ఒక సంస్థ మాత్రం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టనున్నది మహాగట్ బంధనే అని పేర్కొంది. మాసివ్ మెజారిటీతో కాకపోయినా అధికారం చేపట్డేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ గెలుచుకుంటుందని అంచనా వేసింది..
ఇక పోలింగ్ శాతం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా బీహార్ ఓటర్లు ఈ సారి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో వెల్లువెత్తారు. రెండో దశలో సాయంత్రం ఐదు గంటల వరకూ 67.14శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో 64.46 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు విడతలూ కలిపి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 66.11శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక పోలింగ్ ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయడానికి ఏ కూటమికైనా కావలసిన మ్యాజిక్ ఫిగర్ 122.
ఇలా ఉండగా యాక్సిస్ మై ఇండియా, సీవోటర్, ఐపిఎస్ఓఎస్, జన్ కిబాత్, టుడేస్ చాణక్య సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వివిధ చానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వెలువరించాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీహార్ లో మరో సారి ఎన్డీయే అధికారం చేపడుతుంది. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 133 నుంచి 159 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మహాఘట్ బంధన్ కూటమి 75 నుంచి 101 స్థానాలకు పరిమితమౌతుంది. ఇతరులకు 2 నుంచి 13 స్థానాలు దక్కు అవకాశం ఉంది.
ఇక చాణక్య సర్వే మేరకు ఎన్డీయే కూటమి 140 నుంచి 147 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 86 నుంచి 92 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది. ఇతరులు 2 నుంచి 4 స్థానాలలో విజయం సాధిస్తారు. ఇక బీకాన్ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమి 139 నుంచి 144 స్థానాలలోనూ, మహాఘట్ బంధన్ 95 నుంచి 101 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులకు 7 నుంచి 10 స్థానాలు లభించే అవకాశం ఉంది.
అయితే సత్తాబజార్ వెలువరించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ 125 నుంచి 130 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 93 నుంచి 99 స్థానాలకే పరిమితమౌతుంది. ఇతరులు ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన సంస్థలలో అత్యధిక సంస్థలు ఎన్డీయే కూటమే రాష్ట్రంలో మరోసారి అధికార పగ్గాలు చేపడుతుందని అంచనా వేయగా, ఒక్క సంస్థ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ బీహార్ లో అధికారంలోకి వస్తుందని పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/exir-polls-out-39-209361.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.