దివంగత మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ కన్ను పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం షేక్‌పేట్ శివాజీ విగ్రహం వద్ద బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నరని తెలిపారు. ఇదిగో కంప్లయింట్ కాపీ... పంపిస్తున్నా ముఖ్యమంత్రి..నీకు రోషముంటే, పౌరుషముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారని బండి సంజయ్ విమర్శించారు. వాస్తవాలు చెబుతుంటే... నన్ను మతతత్వవాది అంటున్నరు.. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడని కేంద్ర మంత్రి అన్నారు. 80 శాతం మంది హిందువులారా...మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు కమలం పువ్వు గుర్తుపై గుద్ది షేక్ చేయండని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాని పోటీ ఉందని తెలిపారు. హిందువులు వర్సెస్ ముస్లింల మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయిని తెలిపారు.
తురకోళ్ల రాజ్యం కావాలా? హిందువుల రాజ్యం కావాలా? తేల్చుకోండని ఓటర్లకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనరని ఆరొపించారు. కాంగ్రెసోళ్లు ముస్లింలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తున్నరు. కేటీఆర్ నెంబర్ వన్ చోర్ అని ముడుతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకునే తిరిగే కేటీఆర్ కు వేల కోట్లు ఎట్లా వచ్చాయిని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో వేల మంది రైతులు చనిపోయిన సంగతి మర్చిపోదామా? పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక కూలీ పని చేసుకున్న విషయం మర్చిపోదామా అని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా కాలేజీ భవనాన్ని కూల్చేస్తామని స్ఫష్టం చేశారు. అక్కడ పేదలకు ఇండ్లు కట్టి ఇస్తామన్నారు. మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే... కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మోదీ తెలంగాణకు సాయం చేస్తుంటే.. కనీసం ఫోటో కూడా పెట్టడం లేదని తెలిపారు. గోపీనాథ్ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని కూడా చూడనీయకుండా వేధించారని కేంద్రమంత్రి అన్నారు. గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు రెండు ఆధార్ కార్డులున్నాయి. ఇవిగో రెండు ఆధార్ కార్డులు అని వాటిని చూపించారు. గోపీనాథ్ మరణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. నెల రోజుల క్రితమే గోపీనాథ్ కొడుకు తారక్ సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడని బండి సంజయ్ తెలిపారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jubilee-hills-byelection-39-209206.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది