Publish Date:Oct 31, 2025
జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. మూడు సార్లు గెలిచిన బీఆర్‌ఎస్ ఇక్కడ ఏం చేసిందని ప్రశ్నించారు. మనతో ఉండేవాడు నవీన్‌యాదవ్ గెలిపించకుంటే అదొక చరిత్ర తప్పిదం అవుతుందని అన్నారు.
ఆనాడు 2007లో పేదల దేవుడు పీజేఆర్ అకాల మరణం చెందితే… ప్రతి పక్షాలు బీజేపీ, టీడీపీ ఆయనపై గౌరవంతో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయాలంటే.. పీజేఆర్ పై టీఆర్ఎస్ నుంచి బరిలో పెట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈ దుష్ట సంప్రదాయానికి తెర తీసింది ఆయన కాదా? అలాంటి వాళ్లు ఇవాళ సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
కంటోన్మెంట్ లోనూ సానుభూతితో గెలవాలని మొసలి కన్నీరు కార్చార కానీ ప్రజలు అభివృద్ధికే ఓటు వేసి శ్రీగణేశ్ ను గెలిపించారని ఇవాళ 4 వేల కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు.. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నాయన, మున్సిపల్ మంత్రిగా ఉన్నాయన జూబ్లీహిల్స్ కు వచ్చారా.. ఇక్కడి ప్రజల ముఖం చూశారాని ప్రశ్నించారు.
బీజేపీ, బీఆరెస్ ది ఫెవికాల్ బంధం అన్నారు, లోక్ సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏమైనా నిధులు తెచ్చారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు .నంగనాచి కిషన్ రెడ్డి మెట్రో రైలుకు అడ్డం పడుతుండు.. మూసీకి అడ్డుపడుతుండు అన్నారు.
బీఆర్‌ఎస్ వస్తే మీకు సన్నబియ్యం బంద్ అయితాయని తెలిపారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బంద్ అయితాయ్ రేషన్ కార్డులు రద్దు చేస్తామని సీఎం అన్నారు. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం..యువకుడు నవీన్ యాదవ్ ను గెలిపించండి.. అసెంబ్లీలో మీ గొంతుకై మీ సమస్యలను ప్రస్తావిస్తాడని సీఎం రేవంత్ అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jubilee-hills-39-208820.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.