టీడీపీలో జోష్ వైసీపీలో బేజార్!
Publish Date:May 30, 2022
Advertisement
ఒంగోలులో జరిగిన తెలుగు దేశం పార్టీ మహానాడు, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి వేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక, అస్తవ్యస్త, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఎగసిపడుతున్న ప్రజాగ్రహాన్ని మహానాడు వేదిక ప్రతిబించింది. మహానాడు మహా సంకల్పాన్ని నీరు కార్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. తెలుగు దేశం పార్టీ నాయకులూ, కార్యకర్తలను ఎక్కడిక్కడ అణచివేసేందుకు పోలీసు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు తెగబద్దారు. మరోవంక వాలంటీర్లను ఉపయోగించి సంక్షేమ పథకాలు ఆపివేస్తామనే సర్కార్ వారి హెచ్చరికలు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై భౌతిక దాడులు .. అయిన ఇఇని జరిగినా ఆ మూడు రోజులు ఒంగోలు పట్టణం పచ్చసముద్రమే అయింది. తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావును గుర్తు చేస్తూ, ‘నెల ఈనిందా,, అన్నట్లుగా రాష్ట్రం నలుగు చేరాల నుంచి జనం ప్రభంజనమై తరిలిచ్చారు. మహానాడు మహా విజయం రాష్ట్రంలో రాజకీయ పవనాలు ఎటు వేస్తున్నాయో చెప్పకనే చెప్పింది. అదలా ఉంటే మహనాడు తెచ్చిన ఊపును, ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించేందుకు మరో చక్కని అవకాశం, అన్న ఎన్టీఆర్ శతజయంతి రూపంలో అందివచ్చింది. ఎన్టీఆర్ జయంతి రోజున ప్రారంభమైన శతజయంతి వేడుకలు, ఏడాది పొడుగునా, వచ్చే ఏడాది మహానాడు వరకు కొనసాగేలా టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, జిల్లాలు, నియోజక వర్గాల వారీగా మినీ మహనాడులు నిర్వహించాలని నిర్ణయించారు. అదే విధంగా ఎన్టీఆర్ రాజకీయ, సినిమా జీవిత విశేషాలను గుర్తుచేస్తూ, తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ తరం ఓటర్లకు గుర్తుచేసే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అంతే కాదు, 2019 ఎన్నికల తర్వాత, తొలిసారిగా పార్టీలో నూతనోత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నేపధ్యంలో చంద్రబాబు నాయుడు,ఈ ఉత్సాహాన్ని, ఇదే విధంగా కొనసాగించేందుకు, ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వయసును లెక్క చేయకుండా, స్వయంగా చంద్రబాబు నాయుడే, కదన రంగంలోకి దిగుతున్నారు. ప్రతీ పార్లమెంటరీ కేంద్రంలో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు. ప్రతి నెలా రెండు పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పెట్టుకుని ఒక్కో జిల్లాలో మూడు రోజులు గడపాలని ఆయన నిర్ణయించినట్లుతెలుస్తోంది. పది నెలల వ్యవధిలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ పాదయాత్ర లేదా బస్సు యాత్రకు సిద్దమనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇటు చంద్రబాబు, అటు లోకేష్ ఆ ఇద్దరి వెంట తెలుగు తమ్ముళ్ళు, జన ప్రభంజనం సృష్టించేందుకు సిద్దమవుతున్నారు. మరోవంక,ఇప్పటికే, ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరిట రోడ్డునపడ్డ అధికార వైసీపీ గడపగడపన ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటోంది. ప్రజలు వైసీపీ నేతలను ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. అదే విధంగా కొత్త మంత్రుల బస్సుయాత్రలు తుస్సు మన్నాయి. నిజానికి, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ పార్టీలో చిచ్చుపెడితే, కొత్త మంత్రుల పనితీరు, వారి మాటలు వెకిలి వేషాలు జనం ఛీ ..కొడుతున్నారు. ఈ నేపధ్యంలో, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇటు చంద్రబాబు, అటు జగన్ రెడ్డి ఢీ.. అంటే ఢీ అనేందుకు సిద్ధ మవుతున్నారు. అయితే, ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని, ఒక ఛాన్స్ ఇచ్చి మోసపోయామనే భావన ప్రజలో పస్పుట మవుతోందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి మహానాడు తర్వాత టీడీపీ క్యాడర్’ లో జోష్ పెరిగితే, వైసీపీ క్యాడర్ బేజార్ అవుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.
అందులో భాగంగా.. ప్రతీ పార్లమెంటరీ కేంద్రంలో మినీ మహానాడు నిర్వహణకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. మహానాడు వేదికగానే మినీ మహానాడు నిర్వహణ గురించి చంద్రబాబు ప్రకటన చేశారు.
ఈ నేపధ్యంలో, జూలైలో వైసీపీ ప్లీనరీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, రాజకీయ పర్యటనలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/josh-in-tdp-worry-in-ycp-25-136655.html





