Publish Date:Sep 25, 2024
ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రణాళికా బద్ధంగా వైసీపీ ప్రయత్నం చేస్తోందా? అన్న ప్రశ్నకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔననే అనాల్సి వస్తోంది. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. వారంతా తిన్నగా జనసేన గూటికి చేరుతున్నారు. జనసేనాని వారి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, సామినేని ఉదయభానులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వీరు ముగ్గురూ కూడా గురువారం (సెప్టెంబర్ 26) పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరి ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. వీరు ముగ్గురే కాదు.. వీరితో పాటు వీరి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన పంచన చేరే నేతల సంఖ్య ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉంది.
కనీసం మరో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసి జనసేన పంచన చేరనున్నారు. వీటన్నిటికీ జనసేనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యం అని పవన్ కల్యాణ్ గతంల పలుమార్లు ప్రకటించారు. రాజకీయాలలో కొనసాగే అర్హత ఆ పార్టీకి లేదనీ దుమ్మెత్తి పోశారు. అయితే రాజకీయంగా వైసీపీని మళ్లీ పుంజుకోకుండా చేయాలంటే.. ఆ పార్టీ నుంచి వచ్చే వాళ్లందరికీ తమ పార్టీ తలుపులు బార్లా తెరిచేసి జనసేన తిర్థం పుచ్చుకునేలా చేయడమే మార్గమా? అంటే పరిశీలకులు మాత్రం కాదనే అంటున్నారు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన జగన్ అండ చూసుకుని ఆ పార్టీ నేతలు ఇష్టారీతిగా చెలరేగిపోయారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి దూకేస్తున్న వారిలో ఎక్కువ మంది జగన్ అధికారంలో ఉండగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలను వేరే లెవల్ కు తీసుకువెళ్లిన వారే. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తరువాత.. వారంతా కేసుల భయంతో వణికి పోతున్నారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం కూటమి పార్టీలలో ఏదో ఓ పార్టీ పంచన చేరితే చాలని భావిస్తున్నారు. అటువంటి వారికి జనసేనాని జనసేన తలుపులను బార్లా తెరుస్తున్నారు. ఇది కూటమి పార్టీల శ్రేణులు, నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోంది. ముఖ్యంగా గత ఐదేళ్ల పాటు జగన్ హయాంలో తీవ్రమైన వేధింపులు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొన్న పార్టీ నేతలు, శ్రేణులు ఇలా వైసీపీ నుంచి వస్తున్న వారికి పార్టీ తలుపులు బార్లా తెరవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా చంద్రబాబు నేతల తప్పులను క్షమించేసే తత్వం చాలా ఎక్కువ ఉందని తెలుగుదేశం శ్రేణులు భావిస్తుంటాయి. అటువంటి చంద్రబాబే వైసీపీ నుంచి చేరికల విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు. బాలినేని వంటి వారు తెలుగుదేశం తలుపు తట్టినా తెరవలేదు. అయితే జనసేనాని మాత్రం వచ్చిన వారిని వచ్చినట్లుగా అనుమతించడం పట్ల తెలుగుదేశంలోనే కాదు, జనసేనలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఒంగోలులో అయితే ఈ అసంతృప్తి నిరసన ప్రదర్శనలు, ఫ్లెక్సీల చించివేత వరకూ వెళ్లింది. బాలినేని జనసేన గూటికి ఇంకా పూర్తిగా చేరకుండానే ఒంగోలులో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు తలెత్తాయి. విమర్శలు, ప్రతివిమర్శల వరకూ పరిస్థితి వెళ్లింది. ఇది మొత్తంగా కూటమి ఐక్యతను దెబ్బతీయకుండా జనసేనాని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వైసీపీ నుంచి వలసలు జనసేనకు బలం కాదనీ బరువేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/joinings--from-ysp-is-not-strength-to-janasena-25-185588.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.