కోలీవుడ్ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు తమిళనాడు ప్రభుత్వం అనూహ్య షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఆయనకు కల్పిస్తున్న ప్రత్యేక భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్‌తో కూడిన సెక్యూరిటీని తొలగిస్తూ హోంశాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారితీసింది.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ వద్ద ఉన్న గన్‌మెన్లను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి, తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే తాజా ఎన్నికలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే ఆయనకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగరి భద్రత యథావిధిగా కొనసాగుతోంది. ఈ పరిణామంపై అటు ప్రభుత్వం కానీ, ఇటు విజయ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/security-withdrawn-to-vijay-25-219106.html
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.