20 ఏళ్లకే ముసలితనం!

Publish Date:Jan 17, 2022

Advertisement

ఎవరన్నా పెద్దవారు చురుగ్గా ఉంటే ‘అరవైలో ఇరవై’ ఏళ్లవాడిలా ఉన్నారంటూ పొగిడేస్తాము. కానీ ఇప్పటి తరాన్ని కనుక పరిశీలిస్తే ఇరవైలో అరవై ఏళ్లవాడిలా నిస్సారంగా మారిపోతున్నారని గుండెలు బాదుకోక తప్పదు. వైద్యరంగంలో ప్రతిష్టాత్మకమైన Johns Hopkins University పరిశోధనలో వెలుగు చూసిన విషయమిది...

 

ఏ పనీ చేయకుండా ఉండటం, ఒకవేళ పనిచేసినా కూడా ఒళ్లు అలవకుండా ఉండటం ఇప్పటి జీవనశైలి. దానినే మనం sedentary lifestyle అంటున్నాము. పోనీ ఒళ్లు అలవడం లేదు కదా అని వ్యాయామం అన్నా చేస్తున్నామా అంటే అదీ లేదు కదా! కాబట్టి వయసుని బట్టి మనుషుల శారీరిక శ్రమ ఏ తీరున ఉందో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం 12,529 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీరందరినీ వయసుల వారీగా ఐదు విభాగాలుగా విభజించారు. 6- 11 ఏళ్లు, 12- 19 ఏళ్లు, 20- 29 ఏళ్లు, 31- 59 ఏళ్లు, 60- 84 ఏళ్లు అన్నవే ఆ విభాగాలు. వీరంతా రోజూ ఎన్ని కేలొరీలు ఖర్చు చేస్తున్నారో తెలుసుకొనేందుకు ఓ పరికరాన్ని అమర్చారు.

 

ఒక వారంరోజుల పాటు అభ్యర్థుల జీవనశైలిని గమనించిన పరిశోధకులకు ఆశ్చర్యకరమైన విషయాలు బోధపడ్డాయి. 60 ఏళ్లు పైబడినవారు ఒళ్లు కదపకుండా ఎంత బద్ధకంగా జీవిస్తున్నారో, 19 ఏళ్లవారు కూడా అంతే నిస్సారంగా ఉన్నారట. 20 నుంచి 29 ఏళ్లలోపు ఏదో కాస్త ఒంటిని కష్టపెట్టడం కనిపించింది. కానీ ఆ తర్వాత నుంచీ ఒంటికి అసలు శ్రమ అన్నదే తెలియకుండా జీవిచేస్తున్నారట. ఇక 35 ఏళ్లు దాటినవారి గురించైతే అసలు చెప్పనే అక్కర్లేదు! సాధారణంగా ఆడవారికంటే మగవారు ఎక్కువ శ్రమ చేస్తారని అనుకుంటాం. కానీ ఒక వయసు దాటిన తర్వాత అటు ఆడా, ఇటు మగా కూడా ఒంటికి ఎలాంటి పనీ కల్పించడం లేదనీ తేలింది.

 

పెద్దవారైన తర్వాత పని ఒత్తిడి వల్లనో, అలసట చేతనో, ఆనారోగ్యంతోనో శారీరిక శ్రమకి దూరంగా ఉంటున్నారే అనుకుందాం. కానీ 5 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వారు కూడా ఒంటికి అలవనియ్యకపోవడం ఆశ్చర్యకరం. ప్రపంచ ఆరోగ్యం సంస్థ 5 – 17 ఏళ్ల పిల్లలు రోజులో కనీసం ఓ గంటపాటైనా బాగా అలసట కలిగేలా శ్రమించాలని పేర్కొంటోంది. కానీ 19 ఏళ్లు వచ్చేసరికి... మగపిల్లలలో 50 శాతం మంది, ఆడపిల్లలలో 75 శాతం మంది ఎలాంటి శ్రమా లేకుండా గడిపేస్తున్నారట.

 

ఈ రీసెర్చిలో అమెరికాకు చెందిన వ్యక్తులే పాల్గొన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా బహుశా ఇలాంటి గణాంకాలే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మన దేశంలో ఆటలకి సమయాన్ని కేటాయించకుండా, కేవలం చదువుకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడాన్ని గమనిస్తే.... 19 ఏళ్లు ఏం ఖర్మ! బహశా పదేళ్ల వయసులోనే మన పిల్లలు వృద్ధులతో సమానంగా నిస్తేజంగా మారిపోతూ ఉండవచ్చు.

- నిర్జర.

 

By
en-us Political News

  
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.