క్లాస్‌రూంలో నేర్చుకోని పాఠం

Publish Date:Jan 11, 2019

Advertisement


 


అది అమెరికాలో జాన్ హాప్‌కిన్స్‌ అనే యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కి ఓ ఆలోచన వచ్చింది. ‘తన కళ్ల ముందు ఉన్న స్టూడెంట్స్ అంతా మంచి మంచి కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే కదా! వాళ్లు ఎప్పటికైనా మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు కదా! మరి బస్తీలో పెరిగే పిల్లల సంగతి ఏంటి?’ అన్న ఆలోచన ప్రొఫెసర్ మనసుని కదిలించేసింది. వెంటనే ఆయన కొంతమంది స్టూడెంట్స్‌ని పిలిచాడు. ‘ఈ ఊరి చివర ఓ స్లమ్‌ ఏరియా ఉంది కదా! మీరంతా అక్కడికి వెళ్లండి. అక్కడ పిల్లల మనస్తత్వాన్నీ, వాళ్ల నేపథ్యాన్నీ గమనించండి. వాళ్లు పెద్దయ్యాక ఏమవుతారో ఊహించండి?’ అంటూ ఓ ప్రాజెక్ట్‌ వర్క్‌ అప్పగించాడు.


ప్రొఫెసర్ చెప్పినట్లుగానే విద్యార్థులు ఊరి చివర ఉన్న స్లమ్‌ ఏరియాకు వెళ్లారు. అక్కడ పిల్లలని ఓ రోజంతా పరిశీలించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు రెండువందల మంది పిల్లలను గమనించారు. చివరికి వాళ్లలో కనీసం 90 శాతం మంది పిల్లలైనా, పెద్దయ్యాక ఎందుకూ పనికిరాకుండాపోతారని అంచనా వేశారు. వాళ్లలో చాలామంది ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లితీరతారని ఊహించారు. తమ ప్రాజెక్టుని ప్రొఫెసరుకి అందించారు.

 

ఇదంతా జరిగి సుమారు 25 సంవత్సరాలు గడిచింది. ఈసారి ప్రొఫెసరుగారికి మరో ఆలోచన వచ్చింది. తాను ఒకప్పుడు చేయించిన ప్రాజెక్టు ఎంతవరకు నిజమైందో తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఇప్పుడు చదువుతున్న కొంతమందికి పాత పేపర్లు అప్పగించి, అప్పటి పిల్లలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో పరిశీలించి రమ్మని చెప్పాడు.

 

ప్రొషెసరుగారు అప్పగించిన కాగితాలు తీసుకుని విద్యార్థులు బయల్దేరారు. ఆనాటి రెండు వందల మంది పిల్లల్లో ఓ 180 మంది ఆచూకీ కనిపెట్టగలిగారు. వాళ్లంతా రకరకాల వృత్తులలో ఉన్నారని తేలింది. ఆశ్చర్యంగా వాళ్లలో కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే ఏదో ఒక నేరం చేసి జైలుకి వెళ్లినట్లు బయటపడింది. ఒకప్పుడు అల్లరిచిల్లరగా తిరిగిన పిల్లలలో అంత మార్పు ఎలా వచ్చిందో విద్యార్థులకి అర్థం కాలేదు. చివరికి అక్కడ పనిచేసిన ఓ టీచర్ కారణంగా వాళ్లంతా బుద్ధిమంతుల్లా మారిపోయారని బయటపడింది.

 

అంతమందిలో మార్పు తీసుకువచ్చిన టీచర్‌ గురించి విద్యార్థులలో ఆసక్తి పెరిగిపోయింది. ఆవిడ ఎక్కడ ఉంటారో కనుక్కుని విద్యార్థులంతా బయల్దేరారు. ఆ టీచర్‌ని కలవగానే, తాము స్లమ్‌ ఏరియాలో చూసిన అద్భుతాన్ని ఆవిడతో చెప్పుకొచ్చారు. ‘మీరు ఇంతమందిలో మార్పు ఎలా తీసుకువచ్చారు,’ అంటూ ఆ టీచర్ని అడిగారు.

 

విద్యార్థుల ప్రశ్నకి టీచర్‌ ఏమాత్రం తడుముకోలేదు. ‘నేను వాళ్లని ప్రేమించాను. వాళ్లు తప్పకుండా మారతారని నమ్మకం ఉంచాను. ఒక టీచర్‌గా నా బాధ్యతని నిర్వహించాను. వాళ్లు భవిష్యత్తులో నేరగాళ్లు అవుతారనే అనుమానమే నాకు ఉండేది కాదు,’ అంటూ చిరునవ్వుతో చెప్పుకొచ్చింది. ఆ టీచర్‌ సమాధానం విద్యార్థులందరికీ ఓ కొత్త పాఠాన్ని నేర్పింది.


(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.