అసలైన నిందితుడు జారుకుంటున్నాడా!

Publish Date:Feb 18, 2016

Advertisement

జేఎన్‌యూలో గత వారం జరిగిన సంఘటన గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నప్పుడు ఉమర్ ఖాలిద్ అనే వ్యక్తి విద్యార్థుల తరఫున మాట్లాడేందుకు పలు టీవీ ఛానళ్ల ముందుకు వచ్చాడు. అమాయకంగా నవ్వుతూ కనిపించే ఉమర్‌ ఖాలిద్ ఎవరో సాధారణమైన విద్యార్థి నాయకుడు అయిఉంటాడనీ ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఉమర్‌ గురించి ఒక్కొక్కటిగా వెలికివస్తున్న నిజం, అతని నైజం ఎంత ప్రమాదకరమైనదో తెలియచేస్తోంది. ఉమర్‌ నాయకత్వం వహిస్తున్న DSU అనే విద్యార్థి సంఘం ఆది నుంచి వివాదాలకు నెలవుగా ఉండింది. 2010లో దంతెవాడలో 70కి పైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మావోయిస్టులు తుదముట్టించినప్పుడు, DSF విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కశ్మీర్‌ వేర్పాటవాదులను క్యాంపస్‌కు పిలిపించి సకల మర్యాదలు చేయడం, ఆవుమాంసం కోసం క్యాంపస్‌ మెస్‌లో గొడవపడటం, హిందూ దేవతల నగ్న రూపాలను క్యాంపస్‌ గోడల మీద అతికించడం.... ఇలాంటి వివాదాస్పద కార్యకలాపాలకు DSU పెట్టింది పేరు.

 

నిజానికి ఫిబ్రవరి 9వ తేదీన జేఎన్‌యూలో జరిగిని వివాదాస్పద కార్యక్రమానికి ముఖ్య కర్త కూడా ఉమర్‌ ఖాలిదే అని తెలుస్తోంది. ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామంటూ అనుమతిని తీసుకుని అందులో అఫ్జల్ గురుని కీర్తించడం మొదలుపెట్టారు DSU కార్యకర్తలు. ఈ సమయంలో అక్కడే ఉన్న AISF నాయకుడు కన్నయా కుమార్‌మీదే నింద అంతా పడింది. పోలీసులు సరిగా విచారణ చేయకుండానే కన్నయాను అరెస్టుచేసి పారేశారు. కన్నయా కుమార్‌ వామపక్షాలకు అనుబంధంగా ఉన్న సంఘానికి నాయకుడు కావడంతో, వామపక్షాలన్నీ ఒక్కసారిగా ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాయి. ఉమర్‌ మాత్రం తనదైన శైలిలో నవ్వుకుంటూ జారిపోయాడు. నిజానికి ఇలాంటి సమావేశాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఉమర్‌ భావించినట్లు సమాచారం. ఉమర్‌ వంటి ఆలోచనా ధోరణి ఉన్న మరి కొందరు తరచూ జేఎన్‌యూలోకి ప్రవేశించేవారనీ, వీరంతా కలిసి విద్యార్థులలో భారతదేశం మీద ద్వేషం కలిగేలా బ్రెయిన్‌వాష్‌ చేసేవారనీ తెలుస్తోంది.

 

జేఎన్‌యూలో తీవ్రవాదులకు అనుకూలంగా సమావేశం జరిగినప్పుడు పోలీసులు తొందరపాటుగా వ్యవహరించడం వెనక్కి తీసుకోలేని తప్పుగా మిగిలిపోనుంది. ఎందుకంటే కన్నయాకుమార్‌ను పొరపాటున అరెస్టు చేశాం అని ఒప్పుకోవడానికి పోలీసులు నామోషీ పడుతున్నారు. అందుకోసం కన్నయాకుమార్‌ నిందితుడు అని రుజువు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నకొద్దీ, విద్యార్థి నాయకుల పట్ల ప్రజల సానుభూతి పెరిగిపోతూ ఉంటుంది. దీనికి తోడు రాజకీయపక్షాలన్నీ కూడా ఈ వివాదం నుంచి తమదైన శైలిలో లాభాన్ని పొందాలని చూడటంతో ఉమర్ ఖాలిద్‌ మీద చెయ్యి వేయలేని పరిస్థితి వచ్చేసింది.

 

ముందుముందు ప్రభుత్వం ఉమర్ మీద ఎలాంటి ఆరోపణ చేసిన విద్యార్థులు దాన్ని నమ్మే స్థితిని ఇప్పటికే దాటిపోయారు. సోషల్‌ మీడియాలో ఉమర్‌కు పెరిగిపోతున్న ఆదరణే ఇందుకు సాక్ష్యం. ‘నీకు తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని రక్షణవర్గాలు చెబుతున్నాయి. నీ మీద ఇలాంటి ఎన్ని ఆరోపణలు వచ్చినా మేం నమ్మం.’ అంటూ ఉమర్ ఖాలిద్‌ పేర ఉత్తరాలు వెలుస్తున్నాయి. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని జేఎన్‌యూలో చెలరేగిన వివాదానికి కారణం ఎవరో ప్రజలకి తెలియచేసి, తదనుగుణమైన చర్యలు తీసుకోవలసి ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.