124A- ఓ వివాదాస్పద చట్టం

Publish Date:Feb 17, 2016

Advertisement

ఈ వ్యవహారం ఈనాటిది కాదు. దేశద్రోహం పేరుతో ఎవరినైనా జీవితకాలం పాటు జైలులో ఉంచగల 124A ఎప్పుడో బ్రిటిష్ పాలన నాటిది. దేశ స్వాతంత్ర్య సంగ్రామం ఉధృతంగా జరుగుతున్న రోజులలో ఈ చట్టం కిందనే బాలగంగాధర్‌ తిలక్‌ ఏళ్లతరబడి జైలు శిక్షను అనుభవించారు. మహాత్మా గాంధి, భగత్‌సింగ్ వంటి పోరాట యోధులనూ ఈ చట్టం కిందనే ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం హింసించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ చట్టాన్ని కొనసాగించకూడదంటూ ఎందరో పెద్దలు సూచించినప్పటికీ, ఇంకా అది కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఏమిటీ 124A? ఎందుకని అది అంతగా వివాదాస్పదం?

 

124A ప్రకారం ఎవరైనా మాటల ద్వారాగానీ, చేతల ద్వారాగానీ, ప్రదర్శనల ద్వారాగానీ... మరే విధంగానైనాగానీ రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్నీ, ధిక్కారాన్నీ, అవిశ్వాసాన్నీ పెంపొందించేందుకు ప్రయత్నిస్తే అలాంటి చర్యలను రాజద్రోహంగా పరిగణించవచ్చు. సదరు వ్యక్తికి జీవితఖైదు కానీ, మూడుసంవత్సరాల పాటు కారాగారవాసాన్ని కానీ శిక్షగా విధించవచ్చు. న్యాయస్థానం అవసరం అనుకుంటే ఈ శిక్షకు అదనంగా జరిమానాను కూడా విధించవచ్చు. అయితే మూడేళ్ల వరకూ లేకపోతే జీవితకాల ఖైదు అన్న నిబంధన కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ చట్టం కింద జీవితకాల ఖైదుకి బదులుగా, ఏడేళ్ల వరకు మాత్రమే గరిష్ట కారాగార శిక్షను విధిస్తే బాగుంటుందని గతంలో వచ్చిన సలహాలను కూడా ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకోలేదు.


    
ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అందుకనే న్యాయస్థానాలు కూడా ఈ చట్టం కింద తమ ముందుకి వచ్చిన కేసులను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాయి. ఎవరో ఒకరిద్దరు పనికిమాలిన నినాదాలు చేసినంత మాత్రాన వారిని దేశద్రోహం కింద అరెస్టు చేసి కఠినంగా దండించాల్సిన అవసరం లేదని, వారి వల్ల ప్రభుత్వానికి ముప్పేమీ లేదనీ కోర్టు స్పష్టం చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే అరుంధతీరాయ్‌ వంటి ప్రముఖుల మీద సైతం ఈ చట్టం కింద కేసులు దాఖలు అయినప్పటికీ, కోర్టు వారిపట్ల అంత కఠినంగా వ్యవహరించలేదు.

 

 

ప్రస్తుతం జేఎన్‌యూలో జరిగిన గొడవ సందర్భంగా 124A మళ్లీ వార్తలలోకి వచ్చింది. ఈ కేసులో తీవ్రవాది అఫ్జల్ గురుని ప్రస్తుతిస్తూ ఒక సమావేశం ఏర్పాటు అయ్యిందనీ, అందులో భారత వ్యతిరేక నినాదాలు చెలరేగాయన్నది అభియోగం. ఇందుకు బాధ్యుడిగా అక్కడి విద్యార్థి నాయకుడైన కన్నయా కుమార్‌ను అరెస్టు చేసి ఆయన మీద 124Aని మోపారు. జరిగిన దానికి కన్నయా కుమార్‌ ఎంతవరకూ బాధ్యుడన్న విషయాన్ని పూర్తిగా విచారించకుండానే ఆయన మీద ఇంత తీవ్రమైన చట్టాన్ని ప్రయోగించడంతో ఇప్పటి దాకా జేఎన్‌యూ వైపు వస్తున్న విమర్శలు కాస్తా ఇప్పడు ప్రభుత్వం మీదకి మళ్లుతున్నాయి. కన్నయా కుమార్ ఒక్కసారిగా సానుభూతికి కేంద్రంగా మారిపోయాడు.

 

 

ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం ముంగిట్లో ఉండటం వల్ల దీని మీద కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే! కానీ ఈ సందర్భంగా 124Aని ఎలాంటి ఖచ్చితమైన పరిస్థితులలో అమలుచేయాలి, దానిని అమలు చేసే ముందు ఎలాంటి ప్రాథమిక విచారణ జరగాలి అన్నదాని మీద పోలీసు యంత్రాంగం మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ప్రభుత్వ వ్యూహం కాస్తా బెడిసికొట్టి పాలకవర్గానికే చెడ్డపేరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అప్పడు ప్రజల్లో నిజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.