రణరంగం తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి vs కేతిరెడ్డి

Publish Date:Jul 8, 2023

Advertisement

తాడిపత్రిలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు బజారుకెక్కి బూతులతో విరుచుకుపడే స్థాయికి చేరింది. ఏడాది క్రితం వేసిన చీనీ తోట మూడేళ్ళకు కాపుకు రావాల్సి ఉండగా   ఏడాదికే కాపు రాక నష్టపోయినట్లుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ. 13.89 లక్షల పంట బీమా కొట్టేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు చీనీ తోటలను పరిశీలించేందుకు కేతిరెడ్డి తోటకు వెళ్తానంటూ సవాల్ కూడా విసిరారు. దీంతో జేసీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. 

ఈక్రమంలో జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ప్రతి సవాల్ విసిరారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే తనకూ వచ్చిందని.. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని.. కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాదు పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టి చూడాలని సవాల్ విసిరారు. నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష.. ఆ పదవే ఇప్పుడు లేకపోతే జేసీని ఇంటిలో నుంచి బయటకి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా తిప్పేవాడినని ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన వాడిని ఈ రాష్ట్రంలో తాను ఎవరినీ చూడలేదన్నారు.

కాగా, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మొదలైన ఆరోపణల పర్వం తాడిపత్రి పట్టణమంతా వ్యాపించింది. టీడీపీ, వైసీపీ వర్గాలలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో నియోజకవర్గంలోని మిగతా టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు చినీ తోటకి కాపలా ఉన్నారు. దీంతో ఏ నిముషానికి ఏం జరుగుతుందో అనేలా వాతావరణం మారిపోయింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఏది ఏమైనా జేసీ వర్గం చీనీ తోటకి వెళ్లి సందర్శించి అసలు వాస్తవాన్ని ప్రపంచానికి చూపించాలని చూస్తుంటే ఎమ్మెల్యే వర్గం దాన్ని అడ్డుకోవాలని చూస్తుంది.

అయితే, నిజానికి జేసీ ఆరోపించిన దానిలో నిజం లేకపోతే ఎమ్మెల్యే కేతిరెడ్డి భయపడాల్సిన పనిలేదు. మీడియాతో సహా ఓ హార్టికల్చర్ అధికారిని తీసుకుని చీనీ తోటకి వెళ్లి చూసుకుంటే అసలు నిజం తేలిపోతుంది. నిజంగానే పంట పెట్టి మూడేళ్లయినా కాపు లేక నష్టపోయి ఉంటే ఆరోపణలు చేసిన జేసీని ఎండగట్టే అవకాశం ఉంటుంది. కానీ, అదేమీ లేకుండా అసలు తోటకి వెళ్లే వారిని అడ్డుకోవడం.. ఇలా వాడు వీడు అంటూ చెప్పుతో కొడతా అంటూ బూతులు లంకించుకోవడం చూస్తుంటే జేసీ ఆరోపణలే నిజమా అన్న భావన కలుగుతున్నది.

ఓ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఇలా ఇష్టారాజ్యంగా బూతులు తిట్టడంతో మరోసారి వైసీపీ నైజం ఇదేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో మంత్రుల దగ్గర నుండి మహిళా ఎమ్మల్యేల వరకూ ఈ బూతు పురాణంలో చెడ్డపేరు తెచ్చుకోగా కేతిరెడ్డి వారి జాబితాలోనే చేరి పార్టీ పరువు గంగలో కలిపేస్తున్నారు. ఇక  తాడిపత్రిలో ఈ హీటెక్కిన రాజకీయం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
స్నేహితులే కదా అని నమ్మాడు.. వాళ్లు ఫోన్ చేసి పిలిస్తే ఏదో మాట్లాడుకుందామని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కానీ అదే అతడి చివరి అడుగైంది.
భారతదేశంలో కోట్లాది మంది నిత్యం వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కారిడార్‌ అయిన మాదాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన ఓయో హోటల్ యువతి అనుమానాస్పద మృతి ఉదంతం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కొత్తలుపులు తెరుస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.