బొద్దింకలకు ఆహారం అందించిన రెస్టారెంట్ల యాజమాన్యాలకు విచారణల పేరిట పోలీసు వేధింపులు.!

Publish Date:Aug 4, 2026

Advertisement

జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన సమయంలో నిరసన కారులకు ఆహారం అందించిన హోటళ్లు, రెస్టారెంట్లపై పోలీసులు చర్యలు తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయం ఇప్పుడు  దేశ వ్యాప్త చర్చకు తెరలేపింది. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ   నాయకత్వంలో యువత చేపట్టిన నిరసన  36 రోజుల పాటు నిరశన దీక్షలు, ధర్ణాలతో కొనసాగింది. ఈ   పోరాట ఫలితంగా జూలై 25న కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

విద్యార్థి లోకం సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..  ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు. 

జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న యువతకు ఉచితంగా లేదా ఎక్కువ పరిమాణంలో ఆహారం, మంచినీళ్లు అందించారనే కారణంతో పలు ప్రముఖ ఆహార సంస్థల యజమానులను పోలీసులు విచారణల పేరిట వేధిస్తూ వారిపై  ఒత్తిడి తీసుకువస్తున్నారు.   జూలై 20వ తేదీన జరిగిన చలో సంసద్ ర్యాలీ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు..  ప్రాణభయంతో పరుగులు తీసిన విద్యార్థులకు జన్ పత్ లోని 'బ్లూ తోకాయ్ కేఫ్ ఆశ్రయం కల్పించింది. వారికి ఉచితంగా తాగడానికి నీరు, ప్రథమ చికిత్స అందించింది.

అదేవిధంగా లోధి కాలనీకి చెందిన  గర్నిటాస్,  మెహర్‌చంద్ మార్కెట్‌ లోని  డంబో డెలీ, మహాబెల్లీ వంటి రెస్టారెంట్లు కూడా ఆందోళనకారులకు దాహార్తిని తీర్చి, ఆశ్రయంతో పాటు ఆహారాన్ని సరఫరా చేశాయి. ఇప్పుడు ఆ  రెస్టారెంట్ల యజమానులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి, ఏ NGO  తరఫున మీరు ఉచితంగా తిండి సరఫరా చేశారంటూ గంటల తరబడి విచారిస్తున్నారు. 

పోలీసుల వేధింపులకు భయపడి పలు రెస్టారెంట్ల యజమానులు తమ సోషల్ మీడియా ఖాతాలలో విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా పెట్టిన పోస్టులను డిలీట్ చేయాల్సి వచ్చిందంటే పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కూడా  ద్వేషపూరిత బెదిరింపు సందేశాలు వస్తున్నాయని యువత ఆందోళన సమయంలో వారికి ఆహారం, నీరు సరఫరా చేసిన రెస్టారెంట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపినందుకు తమను నేరస్థుల్లా వేధిస్తున్నారని   ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   పోలీసుల ఈ విచారణ కేవలం రెస్టారెంట్లకే పరిమితం కాలేదనీ,   స్విగ్గీ, జోమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల సిబ్బంది వరకూ కూడా సాగుతోందని అంటున్నారు.  

Jantar Mantar protest food delivery, Delhi Police restaurant crackdown, CJP student protest Delhi,  Blue Tokai Janpath incident 

By
en-us Political News

  
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
మైనర్ బాలికను బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి..
విమాన ప్రయాణం అంటే సురక్షితమైనది, ఆహ్లాదకరమైనది అని అందరూ భావిస్తారు. కానీ, నింగిలో ప్రయాణిస్తున్న వేళ ఊహించని విపత్తులు ఎదురైతే ఆ అనుభవం
ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను మూసివేయడానికి లేదా పూర్తిగా ఉపసంహరించుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది.
జగన్ దర్శనం దక్కకుండా సజ్జల అడ్డుకుంటున్నారు..!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యల వ్యవహారంలో ప్రతిపక్ష నేత డీఎంకే వర్కింగ్ ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.
చండీపురా వైరస్ తో 25 మంది చిన్నారులు ప్రాణాల కోసం పోరాడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు వెంటిలేటర్ పై ఉన్నారు.
బహుశా..ఏపీ పోలీసు హిస్టరీలో, ఏపీ ఏమిటి ఇండియాలోనే ఈ తరహా కేసు గతంలో ఎన్నడూ జరిగి ఉండదన్న ఏబీ వెంకటేశ్వరరావు.. కాదంబరి జత్వానీ కేసు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాల్సిన కేసు అని వ్యంగ్యంగా అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.