ఖైరతాబాద్ బరిలో జనసేన: బీజేపీ ఓట్లకు గండేనా?
Publish Date:Sep 30, 2026
Advertisement
తెలంగాణలో ఎన్నికల వేడి రగిలింది. ఒకవైపు శాసనమండలి ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా.. మరోవైపు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నిక రాజకీయాలను వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతుండగా, తాజాగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరి నిలిచేందుకు సై అంటున్నది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయం రసకందాయంలో పడింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి పట్టుదలగా ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా సత్తా చాటుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. . ఇక భారతీయ జనతా పార్టీ సైతంఖైరతాబాద్ లో విజయం సాధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉనికిని చాటుకోవడానికి శ్రమిస్తోంది. ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమతమ అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తును ప్రారంభించాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ కూడా ఖైరతాబాద్ బైపోల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఏదో నామ మాత్రపు పోటీ మాదిరిగా కాకుండా.. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని భావిస్తోంది. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తగిన అంగబలంతో పాటు ఆర్థిక బలం ఉన్న బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తులో ఉండటమే కాకుండా, అధికారంలో కూడా భాగస్వాములుగా ఉన్నాయి. అయితే తెలంగాణ కు వచ్చే సరికి మాత్రం బీజేపీ, జనసేనలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులు ఉంటాయని చెబుతున్నాయి. ఇదే జరిగితే జనసేన పోటీ బీజీపీ ఓట్లకు గండి కొట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ (కల్వకుంట్ల కవిత) బరిలో ఉండటం బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందేనని చెబుతున్నారు. [Janasena, Khairatabad Bypoll, Telangana Politics, Khairatabad Assembly Election, Pawan Kalyan, Danam Nagender Disqualification, Kalvakuntla, Kavita, Trs, Telugu One]
http://www.teluguone.com/news/content/janasena-25-233019.html





