Publish Date:Aug 20, 2026
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది.
ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలలో విభేదాలు, గ్రూపు తగాదాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత కొంత కాలంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని పలు సందర్భాలలో బాహాటంగానే వ్యక్త పరిచారు. అంతే కాకుండా పార్టీ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకిస్తూ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
కాగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్ తో ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభాకర్ రెడ్డి మద్దతుదారులు, అనుచరులు ఆయనపై సస్పెన్షన్ వేటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నాయకులు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
Jakkidi Prabhakar Reddy, LB Nagar Congress, TPCC Suspension, Telangana Congress, TPCC Disciplinary Committee
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jakkidi-prabhakar-reddy-25-229327.html
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.