వచ్చేది మన ప్రభుత్వమే..కార్యకర్తల సంక్షేమమే నా తొలి కర్తవ్యం : వైఎస్ జగన్

Publish Date:Jun 24, 2026

Advertisement

 

పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం..

మన  తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కార్యకర్తల సంక్షేమమే తన తొలి కర్తవ్యం అని ఆయన స్పష్టం చేశారు. పులివెందుల నియోజక వర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు వైఎస్ జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరిన ఆయన వేముల మండలం భూమయ్యగారిపల్లి గట్టు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ఆలయ కలశాన్ని ఎత్తుకొని ఆలయ ప్రవేశం చేసిన వైఎస్ జగన్ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం  భూమయ్యగారిపల్లిలో ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం పులివెందుల పట్టణంలోని ఇరుగుడు పాలెంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.

*రాష్ట్రంలో కక్షపూరిత ప్రభుత్వం 

ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కక్షపూరిత పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజా వనరుల దుర్వినియోగమే పాలకుల లక్ష్యంగా మారిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తామని అన్నారు. పార్టీ కార్యకర్తలే తమ బలమని పేర్కొన్న వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

అధికారంలో ఉన్నా  ప్రతిపక్షంలో ఉన్నా పులివెందుల అభివృద్ధే ధ్యేయం అని ఆయన అన్నారు. పులివెందుల పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీ నిధులతో భాకరాపురం, యర్రగుడిపల్లి, వైఎస్సార్ కాలనీ తదితర ప్రాంతాల్లో  రూ.150 లక్షల వ్యయంతో పూర్తి చేసిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.భాకరాపురంలోని త్రిలోక్ మార్ట్ నుంచి శ్రీరాముని గుడి వరకు రూ.50 లక్షలతో, వైఎస్సార్ కాలనీలో రూ.50 లక్షలతో, యర్రగుడిపల్లిలో గరండాల బ్రిడ్జి సమీపంలో మరో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. 

అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ 2026 సంవత్సరానికి సంబంధించి మరో రూ.110 లక్షల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. చిన్న రంగాపురంలో రూ.40 లక్షలు, పెద్ద రంగాపురంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరి చేందుకు రూ.18 లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేయనున్నట్లు, రోటరీపురం, చెన్నారెడ్డి కాలనీ ప్రాంతాల్లో యూజీడీ, రోడ్ల మరమ్మతు లకు రూ.70 లక్షల ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లు వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పులివెందుల అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
 

By
en-us Political News

  
ఈ నిధుల వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రామ్ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. ఒకవైపు సీఎం యోగి ఈ నిధుల గోల్ మాల్ ను అయోధ్య ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తుంటే.. మరోవైపు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఇది ముమ్మాటికీ బహిరంగ దోపిడీ అని కుండబద్దలు కొట్టారు.
మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ఈ దీక్షా వస్త్రాన్ని ధరించి దీక్ష చేపట్టారు. కే తన గురువు నుంచి మంత్రోపదేశం పొందిన నాటి నుండి పవన్ కల్యాణ్ వారాహి దీక్షను ఏటా చేపట్టడం ఒక సంప్రదాయంగా పాటిస్తూ న్నారు. ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్ష ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు.
ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారతీయ యువతకు అలర్ట్. వర్క్ అండ్ హాలిడే సబ్‌క్లాస్ 462 వీసా బ్యాలెట్ రిజిస్ట్రేషన్‌కు ఈరోజే ఆఖరి గడువు. వయోపరిమితి, ఫీజు మరియు అర్హతల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
226 మంది ప్రజాప్రతినిధుల మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా 26 వేల 47 కోట్ల రూపాయలుగా తేలింది. దీని ప్రకారం లెక్కగడితే, సభలోని ఒక్కో రాజ్యసభ ఎంపీ సగటు ఆస్తి విలువ 15 కోట్లకు పైమాటే. మొత్తం సభ్యులలో 31 మంది ఎంపీలు అంటే దాదాపు 14 శాతం మంది ప్రజాప్రతినిధులు 100 కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తుల ఉన్నవారే.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో సరికొత్త ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2 మరియు ఎయిర్‌పాడ్స్ 4 లపై ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు, ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
భారతదేశంలో యూపీఐ (UPI) చెల్లింపులు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నెలకు రూ. 20 లక్షల కోట్ల లావాదేవీలతో ఫోన్‌పే, గూగుల్ పే సృష్టించిన సంచలనాలు మరియు గ్లోబల్ మార్కెట్లో యూపీఐ క్రేజ్ గురించిన పూర్తి వివరాలు మీకోసం.
వివాహం తర్వాత మీ ఆధార్ కార్డులో భార్య లేదా భర్త పేరును అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? కేవలం ₹50 ఫీజుతో మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో పేరు మార్చుకునే పూర్తి విధానం, అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు మీకోసం
నిఫ్టీ 50 ఇండెక్స్ తొలిసారిగా 24,000 మార్కును తాకి రికార్డు సృష్టించింది. ఈ ఆల్-టైమ్ హై మార్కెట్‌లో మీ మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ (SIP)లను ఆపాలా వద్దా? నిపుణులు సూచిస్తున్న పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ టిప్స్ మరియు పన్నుల పూర్తి వివరాలు మీకోసం
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు. ఎంసీఎక్స్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు మీకోసం.
ఆన్‌లైన్ మరియు డిజిటల్ మోసాల బాధితులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ తెచ్చింది. మోసం జరిగిన 5 రోజుల్లోగా బ్యాంక్ మరియు 1930 హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేస్తే గరిష్టంగా ₹25,000 వరకు పరిహారం పొందవచ్చు. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఆర్‌బీఐ న్యూ డిజిటల్ ఫ్రాడ్ కాంపెన్సేషన్ రూల్స్, షాడో రివర్సల్ పాలసీ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 113 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఎలిసె పేరి హాఫ్ సెంచరీతో రాణించగా, పాక్ జట్టు 86 పరుగులకే ఆలౌట్ అయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హెర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ సంక్షోభానికి తెరపడటంతో.. భారతదేశానికి పెద్ద ఊరట . లభించిందనే చెప్పాలి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్, బంగ్లాదేశ్ మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే హర్మన్‌ప్రీత్ సేన ఈ మ్యాచ్‌లో భారీ రన్‌రేట్‌తో గెలవడం తప్పనిసరి. మ్యాచ్ వివరాలు, బలాబలాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.