ఆజాదీకా అమృత్ మహోత్సవ కమిటీ భేటీకి జగన్ డుమ్మా

Publish Date:Aug 5, 2022

Advertisement

తెలుగు వన్ ముందే చెప్పింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే అజాదీ కా అమృత్ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డుమ్మా కొడతారని. ఇప్పుడు అదే జరుగుతోంది. గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి ఎటూ హాజరు కారు. గత కొద్ది కాలంగా ఆయన మోడీకి అసలు ఎదురు పడటానికే ఇష్టపడటం లేదు.

మోడీ హైదరాబాద్ పర్యటనలలో కూడా ఆయన ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని ఆహ్వానం పలకాల్సి ఉన్నా కూడా పట్టించుకోలేదు. మోడీని కలవడానికి ఇష్టపడలేదు. అందుకే ఆయన ఆహ్వానం అందినా ఆ  సమావేశానికి డుమ్మా కొడతారని తెలుగువన్ ముందుగానే చెప్పేసింది. అయితే కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లే అవకాశాలు లేవని ముందు నుంచీ తెరాస శ్రేణులూ, పరిశీలకులూ కూడా చెబుతూనే ఉన్నారు. కానీ జగన్ ప్రధాని మోడీ ఆహ్వానాన్ని కూడా కాదని ఆ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశానికి గైర్హాజరు అవుతారని మాత్రం తెలుగు వన్ ముందుగానే అంచనా వేసింది. జగన్ ఆ సమావేశానికి డుమ్మా కొట్టడానికి కారణం అదే సమావేశానికి ఏపీ విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందడమేనని కూడా తెలుగు వన్ వివరించింది.

జగన్ రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా పరిగణిస్తారనీ, ఆ కారణంగానే చంద్రబాబు హాజరు అవుతారు కనుక ఆ సమావేశానికి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరని విశ్లేషించింది. అందుకు ఉదాహరణగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు నరసాపురం ఎంపీ హాజరు కాకుండా శత విధాల ప్రయత్నించి సక్సెస్ అయిన సంగతిని ప్రస్తావించింద. ఇప్పుడు తెలుగు వన్ అంచనా వేసిన విధంగానే జగన్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి గైర్హాజరు కావడానికే నిర్ణయించుకున్నారు. అయితే ఆయన హస్తిన పర్యటనకు రేపు బయలు దేరుతున్నారు.

అయితే ఆయన హస్తిన చేరుకునే సమయానికి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ మీటింగ్ పూర్తయిపోతుంది. షెడ్యూల్ ప్రకారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశం సాయంత్రం నాలుగున్నర గంటలకు జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఆ సమావేశంలో పాల్గొనాల్సిన జగన్ మాత్రం ఆలస్యంగా అంటే ఏడున్నర గంటలకు ఢిల్లీ వేళ్లేలా ప్రయాణ షెడ్యూల్ వేసుకున్నారు. అయితే ఆదివారం రాష్ట్రపతి భవన్ లో  నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి జగన్ హాజరౌతారు.
 . 

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.