జగన్ లో ఈడీ విచారణ వణుకు.. మోదీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం ఎదురు చూపు?

Publish Date:Jul 22, 2026

Advertisement

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కేంద్రం శరణు జొచ్చారా? ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ.. వేగం జగన్ ను భయపెడుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ సడన్ ఢిల్లీ పర్యటన వెనుక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా ఈడీ   ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి,  కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న నేపథ్యంలో..జగన్ జంకుతున్నట్లు చెబుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా తనను కూడా ప్రశ్నించడమో, అరెస్టు చేయడమో ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన జగన్  ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను శరణువేడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే జగన్  ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ప్రధాని   నరేంద్ర మోదీ,  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం.. లోక్‌సభ లో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి,  రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా  ప్రధాని, హోంమంత్రులతో అప్పాయింట్ మెంట్ కోసం ఇప్పటికే పీఎంవోకే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు  విజ్ఞప్తులు పంపినట్లు సమాచారం. వారి అప్పాయింట్ మెంట్ దొరకడమే ఆలస్యం జగన్ హస్తినకు పయనం అవుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

 మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ..   ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే   జగన్  పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు.  మద్యం కుంభకోణం కేసులో   ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న   సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండటంతో.. మోడీ, అమిత్ షా అందుబాటులో ఉండటంతో..  పార్లమెంట్ ప్రాంగణంలోనే జగన్ వారిని కలిసేందుకు అవవకాశం  కల్పించాలని ఇప్పటికే వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా.  

రాష్ట్రంలో మద్యం అక్రమ వ్యవహారానికి సంబంధించి ఈడీ దూకుడు గత కొద్ది రోజులుగా  వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ  హయాంలో నిర్ణయాలు తీసుకున్న అధికారులు, రాజకీయ నాయకులకు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన కీలక వ్యక్తుల నుంచి లభించిన సమాచారం  ఆధారంగా   అగ్రనేతల పేర్లు వెలుగులోకి వస్తుండటం.. త్వరలోనే  విచారణకు హాజరు కావలసిందిగా  జగన్ కు ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో.. జగన్ కేంద్రం పెద్దలను ఆశ్రయించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే..ఇప్పటి వరకూ మోడీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించకపోవడంతో జగన్ హస్తిన పర్యటన తేదీ ఖరారు కాలేదని తెలుస్తోంది. అయితే వైసీపీ వర్గాల సమాచారం మేరకు గురువారం(జులై23) జగ్ హస్తినకు చేరుకుంటారనీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించిందనీ తెలుస్తోంది. 

Jittery over ED probe, YS Jagan Delhi Visit, PM Narendra Modi, Amit Shah Appointment, ED Investigation Liquor Case, YSRCP Political News

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.