వైసీపీ సిట్టింగ్‌ లకు స్థాన చలనం తప్పదా?.. గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్న జగన్

Publish Date:Aug 22, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రక్షాళన పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎసరు పెట్టేందుకే నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పదే పదే చెబుతున్న జగన్ అందుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇస్తానని ఇప్పటికే కరాఖండీగా చెప్పేశారు.

విజయం సాధించే అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్ ఇస్తానని చెప్పిన ఆయన ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టేశారని అంటున్నారు. పని తీరు బాగా లేని ఎమ్మెల్యేలను అసలు పరిశీలనలోకే తీసుకునే అవకాశాలు లేవని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అయితే సిట్టింగ్ లు తమ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఓ ఆరు నెలలు సమయం కూడా ఇచ్చారు. అయితే ఆయన ఇప్పటికే సిట్టింగుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశారనీ, ఆరు నెలల సమయం అన్నది కేవలం ఎమ్మెల్యేలను స్వాంతన పరచడానికేననీ ఆయన తీసుకుంటున్న చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించడంతోనే జగన్ తన దృష్టిలో పనితీరు బాగా లేదనుకున్న సిట్టింగ్ లకు ప్రత్యామ్నాయాలను ఇప్పటి నుంచే అన్వేషిస్తున్న సంగతి స్పష్టమైందని పరిశీలకులు అంటున్నారు.

తాడికొండ నియోజవకర్గానికి అదనపు సమన్వయ కర్తను నియమించడం ద్వారా సిట్టింగు ఎమ్మేల్యేలందరికీ స్పష్టమైన సంకేతాన్ని జగన్ పంపారని అంటున్నారు. తాడికొండ నియోజకవర్గానికి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ను నియమించిన విధంగానే పని తీరు బాగాలేని పలు నియోజకవర్గాలకు కూడా ప్రత్యామ్నాయాలను జగన్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల వివాదాస్పద విడియో కారణంగా పార్టీ పరువును మంటగలిపిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో సారి పోటీకి అవకాశం ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

ఆయన స్థానంలో ఉషశ్రీ చరణ్ ను రంగంలోనికి దింపే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కల్యాణ దుర్గం నుంచి కాంగ్రెస్ నాయకుడు రఘువీరా రెడ్డి కుమార్తెకు అవకాశం ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కూడా స్థాన చలనం తప్పదని చెబుతున్నారు. అలాగే మంత్రి అంబటి రాంబాబుకూ స్థానం మార్పు తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్యేగా పోటీచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న త‌రుణంలో ఆయ‌న్ను వేమూరు నుంచి బ‌రిలోకి దింపి మంత్రి మేరుగ‌ నాగార్జునను బాపట్ల పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. అలాగే అంబటి రాంబాబును అవనిగడ్డ నుంచి రంగంలోనికి దింపాలని జగన్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మెజారిటీ స్థానాల్లో పోటీచేసే అభ్య‌ర్థుల జాబితాను డిసెంబ‌రుక‌ల్లా పూర్తిచేయాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌స‌ర‌త్తులు చేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద సిట్టింగ్ ల స్థానాల మార్పు పార్టీలో తీవ్ర అలజడికి, అసంతృప్తికి దారి తీసే అవకాశాలున్నాయని అంటున్నారు. తాడికొండ విషయంలో ఉండవల్లి శ్రీదేవి తన అనుచరులతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పార్టీలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన అసమ్మతి జ్వాలల మాదిరిగానే.. సిట్టింగుల విషయంలో ఒక సారి జగన్ తన నిర్ణయం ప్రకటించగానే పార్టీలో అసంతృప్తి మంటలు ఎగసి పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.