Publish Date:Jul 21, 2022
వైసీపీ, బీజేపీ సయోధ్యకు ఫుల్ స్టాప్ పడింది. అందుకు తార్కానాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న కాక మొన్న అఖిల పక్షంలో ఏపీ అప్పులను వేలెత్తి చూపిన కేంద్రం ఇప్పుడు కేంద్రం అందిచే ఉచిత బియ్యం పంపిణీ ఏపీలో నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ ఉచిత బియ్యం పంపిణీ గత నాలుగు నెలలుగా నిలిచిపోయినా ఇప్పటి వరకూ కిమ్మనని కేంద్రం.. రాష్ట్ర పతి ఎన్నిక ముచ్చట ముగియగానే వైసీపీ సర్కార్ పై బియ్యం పంపిణీ నిలిపివేతపై సీరియస్ అయ్యింది.
బియ్యం లేవన్న సాకుతో ఏపీ సర్కార్ ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు జూలై నెలలో కూడా పరిస్థితి అదే. ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేతపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఇంత కాలం కిమ్మనకుండా ఊరుకున్న కేంద్రం ఇప్పుడు మాత్రం సీరియస్ గా తీసుకుంది. మరో వైపు ఏపీ బీజేపీ నాయకులు కూడా స్వరం పెంచి విమర్శల తీవ్రతను పెంచారు. అక్కడితో ఊరుకోకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. కేంద్రం పేదల కోసం ఉచితంగా బియ్యం అందిస్తుంటే.. ఆ పేదల బియ్యాన్ని కూడా వైసీపీ సర్కార్ బొక్కేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు చేస్తున్న విమర్శలపై జగన్ సర్కార్ స్పందించడం లేదు.
కానీ పేదల బియ్యాన్ని వైసీపీ సర్కార్ నొక్కేస్తోందన్న విమర్శల వల్ల ప్రజా వ్యతిరేకత మరింత ఎక్కువ అవుతుందన్న ఆందోళన మాత్రం వైసీపీ వర్గాలలో వ్యక్తమౌతోంది. అసలు సంగతి ఏమిటంటే కోవిడ్ తో నష్ట పోయిన ప్రజలకు కొంత ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కంద ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. 2022 మార్చితో ఉచిత పంపిణీ పథకం ముగిసినప్పటికీ దానికి కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే ఈ ఏడాది అక్టోబర్ వరకూ ఈ పథకం కొనసాగుతుంది.
అయితే ఏపీలో మాత్రం ఉచిత బియ్యం పంపిణీ పథకం ఏప్రిల్ నుంచే నిలిచిపోయింది. వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికీ 5 కిలోల చొప్పున ఈ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి ఇందుకకోసం బియ్యం సకాలంలో ఎలాంటి జాప్యం లేకుండా రాష్ట్రానికి చేరుతోంది. అయితే జగన్ సర్కార్ మాత్రం గత నాలుగు లెలలుగా బియ్యం నిల్వలు లేవనో.. సాంకేతిక సమస్యలనో సాకులుగా చూపుతూ బియ్యం పంపిణీకి తిలోదకాలిచ్చేసింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సవ్యంగా ఉచిత బియ్యం పథకం అమలులో ఉన్నా, ఏపీలో మాత్రం మొండి చేయి చూపుతుండడం పట్ల కేంద్రం సీరియస్ అయ్యింది.
ఉచిత బియ్యం పేదలకు అందించకుంటే రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణతో పాటు బియ్యం పంపిణీని సైతం నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో అధికార వైసీపీని ఇరుకున పెట్టే విధంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పేదల బియ్యాన్ని నొక్కేస్తున్నారని నినాదంతో నిరసన కార్యక్రమాలకు తెరలేపింది. ప్రధాని మోదీ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం అందిస్తుంటే జగన్ సర్కారు అడ్డుకుంటోందని ఇలా ఉండగా కేంద్ర ఉచిత బియ్యం పంపీణీని నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో అందించి ఇక్కడ మాత్రం మొండిచేయి చూపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. అటు లబ్దిదారులు సైతం ప్రభుత్వం తీరును గర్హిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-sarkar-and-center-clash-on-free-rice-39-140228.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.