విజయమ్మను అలా వేడుకున్న జగనన్న!

Publish Date:Apr 4, 2022

Advertisement

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ... తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారని సమాచారం. ఇదే విషయాన్ని తన కుమారుడు, ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ మోహన్ రెడ్డికి  వెల్లడించగా.. ఫ్యాన్ పార్టీ ప్లీనరీ సమావేశాల వరకు ఆగాలంటూ కన్నతల్లి విజయమ్మకు సీఎం జగన్ టైమ్ ఇచ్చినట్లు.. ఇటు లోటస్ పాండ్‌తోపాటు అటు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా ఓ టాక్ అయితే మస్త్ మస్త్‌గా వైరల్ అవుతోంది. 

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత... ఆయనకు ఆయన తల్లి వైయస్ విజమయ్మతోపాటు ఆయన చెల్లి వైయస్ షర్మిలకు మధ్య చాలా గాప్ వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసేందే. ఈ నేపథ్యంలో.. వారిరువురు పక్క రాష్ట్రానికి వెళ్లడమే కాదు.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ..  వైయస్ షర్మిల.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఓ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు, రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ... ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేస్తూ.. రాష్ట్రంలోని ప్రజా సమస్యల తెలుసుకునేందుకు ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిందీ వైయస్ షర్మల. అయితే షర్మిల వెంటే.. ఆమె తల్లి వైయస్ విజయమ్మ కూడా ఉంటున్నారు. దాంతో ఆమె... వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆ పదవికి రాజీనామా చేయాలని వైయస్ విజమయ్మ నిర్ణయించి.. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు తెలుపగా.. ఆయనపై విధంగా ఆమెకు టైమ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ పదవికి విజయమ్మ రాజీనామా చేస్తే.. ఆ పదవి ఎవరికి ఇస్తారంటూ ఓ చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ రెడ్డి పేరు తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్ పార్టీ ప్లీనరీ అనంతరం ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైయస్ భారతీ రెడ్డి బాధ్యతలు చేపడతారని సమాచారం.    

మరోవైపు 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిందంటే.. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి..  ముఖ్యమంత్రి అయ్యారంటే.. అదీ వైయస్ జగన్ ఒక్కడే పడ్డ కష్టమేమి కాదని.. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆయన సోదరి వైయస్ షర్మిల జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేయడం.. అలాగే జగన్ బావా బ్రదర్ అనిల్ తెరచాటు రాజకీయంతోపాటు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. వ్యూహారచన కూడా తోడు అయిందని ఓ చర్చ అయితే ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా నడుస్తోంది. ఆ క్రమంలోనే ఫ్యాన్ పార్టీ  అధికారంలోకి వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే.  

మరి రానున్నది ఎన్నికల సీజన్.. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో తల్లి చెల్లి లేకుండా..  వైయస్ జగన్ అండ్ కో ప్రజల్లోకి వెళ్లితే.. వారంతా జగన్ వైపు నిలబడతారా?.. ఆయన మాటలను విశ్వసిస్తారా?  ఆయన పార్టీకి ఓట్లు వేస్తారా? అంటే సందేహమే అనే సమాధానం.. ప్రజల నుంచి వస్తోంది. 2019 ఎన్నికల వేళ .. రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ ప్రచారం చేసి.. ఆ తర్వాత.. రాజన్న భార్య విజయమ్మ, రాజన్న కుమార్తె వైయస్ షర్మిలలను దూరం పెట్టిన జగన్‌ మాటలను ప్రజలు నమ్ముతారా? అంటే ఏమో సందేహమేననే సమాధానం ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలే నుంచే వస్తోంది. 

గత ఎన్నికల వేళ.. మాట తప్పం.. మడమ తిప్పం అని చెప్పి.. ఓట్లు అడిగినా వైయస్ జగన్... కన్న తల్లి  వైయస్ విజయమ్మ.. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి వదులుకున్న తర్వాత.. జగన్‌తోపాటు ఆయన భార్య భారతీలు ఏ ఫోటో పట్టుకుని ప్రజల్లోకి వెళ్తారనే ఓ చర్చ అయితే తెలుగు ప్రజల్లో అంతర్గతంగా నడుస్తోంది. ఏదీ ఏమైనా.. రానున్న ఎన్నికల వేళ.. జగన్ అండ్ కోతోపాటు.. ఆ పార్టీ భవిష్యత్తు ఏమిటనే ఓ ప్రశ్న అయితే .. ఫ్యాన్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరి మనస్సును తొలుస్తోంది.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.