జగన్ ది సైకోయిజం.. ఆయనవి నీచ రాజకీయాలు.. కుండబద్దలు కొట్టిన వసంత కృష్ణ ప్రసాద్
Publish Date:Feb 5, 2024
Advertisement
అప్పటి నేతలు అసభ్యకర పదజాలం చాలా తక్కువగా వాడేవాడు.. ఒకవేళ అసభ్యకర పదాలు ఏ రాజకీయ నాయకుడైనా ఉపయోగిస్తే వారికి తరువాత అధినేతలు మందలించేవారు. క్లాస్ పీకేవారు. దీంతో ప్రతిపక్షంలోని నేతలు, అధికార పక్షంలోని వారు రాజకీయ ప్రసంగాల్లో అసభ్యకర పదజాలం ఉపయోగించాలంటే భయపడేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ ఆర్ హయాంలో చాలావరకు క్రమశిక్షణ కలిగిన రాజకీయాలే నడిచాయనడంలో సంకోచం అక్కర్లేదు. కానీ, ప్రస్తుతం వైఎస్ జగన్ హయాంలో రాజకీయాలకు అర్థమే మారిపోయిందన్న భావన ఏపీ ప్రజలలో బలంగా వ్యక్తమవుతుంది. జగన్ హయాంలో కొందరు మంత్రులకు ఏపీ ప్రజలు బూతుల మంత్రులుగా పేర్లు పెట్టారంటే జగన్ తరహా రాజకీయం ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశం మొత్తం ప్రస్తుతం ఏపీ వైపు చూస్తోంది.. ఇలాకూడా రాజకీయాలు చేస్తారా? ఇంత దారుణంగా అసభ్యకర పదజాలాన్ని రాజకీయ ప్రసంగాల్లో ఉపయోగిస్తారా? కుటుంబ సభ్యుల్లోని ఆడవారిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఇంత దారుణంగా చేస్తారా అని ఆశ్చర్య పోతున్నారు. ఏపీలోని కొందరు మంత్రులు ప్రెస్ మీట్లు, సమావేశాలు టీవీల్లో ప్రసారం అవుతున్నాయంటే పిల్లలు చూడకుండా తల్లిదండ్రులు టీవీలు ఆపేసే పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఇంతలా ఏపీలో రాజకీయాలు దిగజారిపోవడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డే కారణమంటున్నారు పరిశీలకులు. ఆ పరిశీలకులు చెబుతున్నదే వాస్తవమని తాజాగా నిర్ద్వంద్వంగా వెల్లడైపోయింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జగన్ ప్రవర్తన గురించి సంచనల విషయాలను వెల్లడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో జగన్ పాలన ఉంటుందని అనుకున్నా.. కానీ, వైఎస్ఆర్ పాలనకు ప్రస్తుత జగన్ పాలనకు ఏమాత్రం పోలిక లేదని వసంత కృష్ణప్రసాద్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. కక్షసాధింపు చర్యలు వద్దు, వై ఎస్ లా పాలించండని పలుసార్లు తాను ఆయనకు చెప్పే ప్రయత్నం చేశానన్నారు. తాను రెండు మూడుసార్లు జగన్ ను కలిసిన సందర్భంలో ఆయన లోకేష్ , చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను తిట్టవు నిన్నెలా నమ్మాలని అన్నారని చెప్పారు. అన్నారు. జగన్ దృష్టిలో ప్రతిపక్ష నాయకులను బండబూతులు తిడితేనే రాజకీయ నేత, వాళ్లకే మంత్రి పదవులు ఇస్తారు. తిట్టని వాళ్లకి ఎమ్మెల్యే , పార్లమెంటు సీట్లు ఇవ్వనని జగన్ స్వయంగా చెప్పారని వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. తాను హుందా రాజకీయం మాత్రమే నేను చేస్తానని జగన్ కు స్పష్టంగా చెప్పానని కృష్ణ ప్రసాద్ అన్నారు. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చెప్పిన మాటలను బట్టి చూస్తే, జగన్ రెడ్డివి ముమ్మాటికీ నీచ రాజకీయాలేనని తేటతెల్లమౌతోంది. వసంత మాటలు విన్నతరువాత జగన్ నీది సైకో రాజకీయం కాదా? అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సైకో రాజకీయాలతో ఏపీ పరువు తీస్తున్నారంటూ బాహాటంగా విమర్శిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-pshyco-politics-25-169959.html





