Publish Date:Feb 11, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పాసు పుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మ మాయం కానుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో తన ఫొటోల పిచ్చితో ఇష్టారీతిగా ఎక్కడపడితే అక్కడ తన ఫొటోలను ముద్రించుకున్న జగన్.. ఏకంగా సర్వేరాళ్లపైనా, రైతుల ఆస్తికి సంబంధించిన అధికార పత్రమైన పట్టాదారు పాసు పుస్తకాలపైనా కూడా తన బొమ్మలు వేయించుకున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించి, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ బొమ్మలను లేపేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ దిశగా అన్ని చర్యలూ తీసుకుంది. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటోను తీసేసి రాజముద్ర ఉన్న కొత్త పాసు పుస్తకాలను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.
జగన్ హయాంలో భూముల రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాసుపుస్తకాలను వెనక్కి తీసుకొని, వాటిస్థానంలో కొత్త పాసు పుస్తకాలను ఇవ్వనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అలాగే వచ్చే నెలాఖరు నాటికి సర్వేరాళ్లపై ఉన్న జగన్ బొమ్మల తొలగింపు కూడా పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.
జగన్ అధికారంలో ఉండగా ఆయనకు ఫొటోల పిచ్చి పీక్స్ లో ఉండేది. ఆయన ఫొటోల పిచ్చిపై నెటిజనులు పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని ఓ సినిమాలో డైలాగ్ ను ప్రస్తావిస్తూ జగన్ కు పిచ్చి పరాకాష్టకు చేరిందంటూ అప్పట్లో సెటైర్లు కూడా వేసేవారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జగన్ బొమ్మ ఉండి తీరాల్సిందేనన్నట్లుగా ఆయన హయాంలో పరిస్ధితి ఉండేది. చిత్రమేమంటే ఎల్‌పీఎం రికార్డుల్లోనూ జగన్ మొహమే కనిపించేది. తన బొమ్మ కనిపించకపోతే జనం తనను మరిచిపోతారేమోనని జగన్ భయపడుతున్నారా అన్నట్లుగా అన్ని చోట్లా ఆయన ఫొటోయే కనిపించేలా ఆయన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఎక్కడ చూసినా తన బొమ్మ మాత్రమే కనపడాలన్నట్లుగా ఆయన పాలన సాగింది. రాష్ట్ర ప్రభుత్వ సమష్టి బాధ్యతను సాంతం తన ఖాతాలో వేసి తనను శాశ్వత ఆరాధ్యుడిగా చేసుకునేందుకు జగన్ తహతహలాడారు. అందు కోసం అధికారులను అష్టకష్టాలూ పెట్టారు. జనాలకు ఇష్టం ఉన్నా లేకున్నా తన మొహం చూడకుండా రోజు గడవని ఖర్మ తీసుకొచ్చి పెట్టారు. ఇందు కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు పాసు పుస్తకాలపైనా, సర్వే రాళ్లపైనా జగన్ ఫొటోలను తీసి ఆవల పారేసి రైతులకు ఊరట కలిగిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-photoo-removed-39-192738.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.