ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మొదటికి వచ్చారు. కోర్టుకు ఆదేశాలను ధిక్కరిస్తానంటూ ఏకంగా కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల లండన్ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చిన సందర్భంగా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని షరతు విధించింది. అప్పుడు ఆ షరతుకు ఓకే అన్న జగన్.. ఇప్పుడు దానిని ఉల్లంఘించడానికి రెడీ అయిపోయి..
కోర్టు షరతును ఉల్లంఘిస్తాను అనుమతి ఇవ్వండి అంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో తాను కోర్టుకు హాజరు కాలేనని పేర్కొంటూ, ఒక వేళ ఆయన తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అయితే.. అందుకు ప్రత్యేక మైన భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందనీ, అది తనకు ఇష్టం లేదు కనుకనే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనీ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఆయన ఎంత వితండ వాదం చేస్తున్నారంటే.. కోర్టుకు హాజరు కావడం అన్నది ఆయన ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయంగా చెబుతున్నారు. న్యాయవ్యవస్థ అంటే తనకు లెక్కలేదన్నట్లుగా ఆయన పిటిషన్ ఉంది. నిజంగా ఆయన కోర్టు హాజరు సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాల్సి ఉంటే ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వ ఏర్పాట్ల విషయంలో ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం ఏముంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పుష్కరంపైగా బెయిలుపై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఆ బెయిలు షరతులను సైతం ఉల్లంఘిస్తుండటం పట్ల న్యాయ నిపుణులలో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది. పైగా తాను హాజరు కాను కనుక అవసరం అనుకుంటే కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే హాజరౌతానంటూ ఆ పిటిషన్ లో కోర్టుకే బంపరాఫర్ ఇచ్చారు. ఇక్కడే న్యాయనిపుణులు ఆయన పరామర్శల పేరిట దర్జాగా రాజకీయయాత్రలు చేస్తున్నప్పుడు అడ్డు రాని భద్రత.. కోర్టుకు హాజరు కావడానికే అడ్డువచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-petition-in-cbi-court-39-209130.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది