జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు అత్యంత కీలకంగా మారింది. మూడు పార్టీలూ ఈ ఉప ఎన్నికలో విజయాన్ని చావో రేవో అన్నట్లుగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీ ఉప ఎన్నిక మూడు పార్టీలకూ అగ్నిపరీక్షగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచార వేడి రోహిణీకార్తెను మించిపోతున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గం హోరెత్తిపోతున్నది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ఈ తీరు పెరిగిపోతున్నది.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. 14న ఫలితం వెలువడనుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో నిలిచారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం (నవంబర్ 6) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోరబండ డివిజన్ లో పర్యటించిన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. తాను కట్టర్ హిందువునని, ఇతర మతాలకు చెందిన వారి టోపీ పెట్టుకుని, దొంగ నమాజ్ చేసి కించపర్చనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే తల నరుక్కుంటా గానీ టోపీ పెట్టుకోన్నారు. మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని ఆరోపించారు. ఈ మాట స్వయంగా గోపీనాథ్ తల్లి చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు వావి వరసల్లేవని, చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేదన్నారు. సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమని తీవ్ర విమర్శలు గుప్పించారు.తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకోవాలంటూ కల్వకుంట్ల కవితకు హితవు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు తినేటోడు వచ్చాడని విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఆడోళ్ల మెడల్లో ఉన్న మంగళసూత్రాలు కూడా గుంజుకుపోతారని బండి సంజయ్ అన్నారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా నటుడు వేణుమాధవ్ గుర్తొచ్చాడని బండి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cut-my-head-instead-wearing-topi-39-209126.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది